
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 72


మహేష్ కు నమ్రత స్వీట్ విషెస్- ప్రతిరోజూ నువ్వే

తేజ్ సోల్ ఆఫ్ సత్య సాంగ్ టీజర్ రిలీజ్

జైలర్ కోసం మిల్లర్ వెయిటింగ్

ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానున్న సలార్

పుష్ప 2 షూటింగ్ అప్డేట్

100 డేస్ సెలబ్రేషన్స్ లో దసరా

మహేష్ బిజినెస్ మేన్ తో ఖుషి ట్రైలర్

కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

NC23 ఫుల్ కసరత్తులో ప్రీ ప్రొడక్షన్ పనులు

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ

గాండీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

తేజ్ సత్య నుండి సాంగ్ టీజర్

గేమ్ చేంజర్ షూటింగ్ అప్డేట్

జైలర్ అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్

ఖుషి ట్రైలర్ రిలీజ్
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖుషి ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.రీసెంట్ గా విడుదలైన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ కావడంతో సినిమాఫై హైప్ క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలకు తగ్గట్లుగా వుంది.విప్లవ్,ఆరాధ్యల ప్రేమ ఆతరువాత వారి వైవాహిక జీవితం చుట్టూ తిరిగే కథతో వస్తుంది ఖుషి.విప్లవ్ పాత్రలో విజయ్ దేవరకొండ,ఆరాధ్య పాత్రలో సమంత నటించారు.వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాలో హైలైట్ కానుంది.ట్రైలర్ లో మాత్రం విజయ్,సమంత ల లుక్ అదిరిపోయింది.విజువల్స్ చాలా బాగున్నాయి.ట్రైలర్ చూస్తుంటే ఈసినిమాతో సాలిడ్ హిట్ కొట్టి విజయ్ మళ్ళీ ట్రాక్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.

మహేష్ కు నమ్రత స్వీట్ విషెస్- ప్రతిరోజూ నువ్వే
తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకొని ప్రస్తుతం స్టార్ హీరోగా సినీ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. నేడు మహేష్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్ డే విషెస్ ను అందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేశారు. శ్రీ మహేష్ బాబు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కృష్ణ గారి…

తేజ్ సోల్ ఆఫ్ సత్య సాంగ్ టీజర్ రిలీజ్
మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ వరుసగా హిట్లను అందుకుంటూ కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. రిపబ్లిక్, విరూపాక్ష రీసెంట్ గా బ్రో ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ తన తరువాత సినిమాను సంపత్ నందితో చేయనున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ ప్రాజెక్ట్ లో సాయి తేజ్ కాస్త గ్యాప్ తీసుకొని జాయిన్ అవుతాడు. ఒక మూడు నెలల నుండి ఆరు నెలల వరకూ ఫిజికల్ ఫిట్ కోసం గ్యాప్ తీసుకుంటానని ఇప్పటికే చెప్పాడు తేజ్. ఈ గ్యాప్ లో ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేయనున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించనున్నట్టు తెలుస్తుంది.

గుంటూరు కారం నుండి మహేష్ పోస్టర్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం నుండి పోస్టర్ రిలీజ్ అయ్యింది.ఈరోజు మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఈ సందర్భంగా సినిమా నుండి ఆయన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఇక ఈ పోస్టర్ లో మహేష్ లుంగీ కట్టుకొని బీడీ తాగుతూ మాస్ లుక్ లో కనిపించాడు.ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం కాగా ఇప్పటివరకు 30 శాతం పూర్తి అయ్యింది. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

వాల్తేరు వీరయ్య 200 రోజులు వేడుక- చరిత్రని తిరగరాసినట్లు ఉంది
బాబీ డైరెక్షన్ లో మెగస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజ రవితేజ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయ. చిరంజీవి డ్యాన్సులు, నటన వింటేజ్ చిరంజీవిని గుర్తుచేసి ప్రేక్షకులను ఆకట్టున్నాయి. చిరు, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్‌ని విపరీతంగా అలరించాయి. ఇక ఈసినిమా థియేటర్లలో విజయవంతంగా 200 రోజులను పూర్తి చేసుకుంది.

జైలర్ కోసం మిల్లర్ వెయిటింగ్
తలైవా రజినీకాంత్ ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. ఈసినిమాను కూడా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. అన్నాత్తే తరువాత చాలా లాంగ్ గ్యాప్ తో వస్తున్న సినిమా ఇది. దీంతో ఈసినిమా కోసం అభిమానులు కూడా ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఇక వారందరి ఎదురుచూపులకు ఇంకా మరికొద్ది గంటల్లో బ్రేక్ పడనుంది. ఇంకా ఒక్క రోజులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానున్న సలార్
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చే నెలలో విడుదలకానుంది.ఇటీవల విడుదలైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా ఐమాక్స్ వెర్షన్ లో కూడా విడుదలకానుందట.ఇంతకుముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ని కూడా ఐమాక్స్ వెర్షన్ లో విడుదలచేయాలనుకున్నారు కానీ కుదరలేదు అయితే సలార్ మాత్రం ఐమాక్స్ వెర్షన్ లో రిలీజ్ కానుందట.తెలుగులో మొదటి సారిగా ఐమ్యాక్స్ వెర్షన్ లో విడుదలైయిన సినిమా బాహుబలి 2.దాంతో ఇప్పుడు సలార్ రెండో సినిమా కానుంది.

పుష్ప 2 షూటింగ్ అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ది రూల్ షూటింగ్ మేజర్ బ్రేక్ లేకుండా రెగ్యులర్ గా కొనసాగుతుంది.ఇటీవల ఓ కీలకమైన షెడ్యూల్ ను పూర్తిచేయగా ఈరోజు మరో షెడ్యూల్ ప్రారంభమైంది.ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ జరుపుతున్నారు.ఈషెడ్యూల్ లో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న కూడా జాయిన్ కానుంది.ఇది ఆమెకు రెండో షెడ్యూల్ కానుంది.

100 డేస్ సెలబ్రేషన్స్ లో దసరా
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో నాని, కీర్తి సురేష్ నటన ,శ్రీకాంత్ డైరెక్షన్,సంతోష్ నారాయణన్ సంగీతం హైలైట్ గా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూాడా ఈసినిమా నానికి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది. అంతేకాదు ఓటీటీ లో కూడా ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఓటీటీ లో కూడా ఈసినిమా మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది.

మహేష్ బిజినెస్ మేన్ తో ఖుషి ట్రైలర్
శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం.. దానికి తోడు సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో శివ నిర్వాణ ఎక్పర్ట్ కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్, పోస్టర్లు, పాటలు రిలీజ్ అవ్వగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సినిమాకు ఏదో ఒక వైవిధ్యం ఉండేలా చూసుకుంటాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కింగ్ ఆప్ కోత. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా 80, 90 కాలం బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే రీసెంట్ గా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ కు…

NC23 ఫుల్ కసరత్తులో ప్రీ ప్రొడక్షన్ పనులు
రీసెంట్ గానే కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో నాగ చైతన్య. ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. యదార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే అర్థమైంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. మరి రియల్ ఇన్సిడెంట్ తో ఈసినిమాను తీస్తున్నారు కాబట్టి.. రియల్ ఇన్సిడెంట్స్ తో సినిమా అంటే కచ్చితంగా హోం వర్క్, రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే నాగచైతన్య, చందూ మొండేటి, బన్నీవాసు ఆ పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే కె.మత్స్యలేశం…

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమాను ప్రకటించిన తరువాత సెట్స్ పైకే చాలా లేట్ గా వెళ్లింది. ఇక ఎలాంటి బ్రేక్స్ లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది అనుకున్నారు. అలా సెట్స్ పైకి వెళ్లి ఫస్ట్ షెడ్యూల్ ను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ కు మాత్రం మళ్లీ లాంగ్ గ్యాప్ వచ్చేసింది. ఈనేపథ్యంలో ఈసినిమా షూటింగ్ పై అలానే రిలీజ్ పై మళ్లీ పలు రూమర్లు మొదలయ్యాయి. దీంతో ఈవార్తలకు…

గాండీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా కాంపౌండ్ నుండి వచ్చీ కూడా తన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందించారు మేకర్స్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈనేపథ్యంలోనే వరుణ్ తేజ్ డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టేశాడు. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ప్రీ టీజర్, టీజర్, నీజతై పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీ టీజర్ లో టీజర్ లో హాలీవుడ్ రేంజ్ లో ఉన్న విజువల్స్ యాక్షన్…

పుష్ప 2 నుండి ఫహద్ పోస్టర్ రిలీజ్
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప ది రూల్ నుండి ఫ్రెష్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫహద్ ఫాసిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈ రోజు ఫహద్ పుట్టిన రోజు సందర్బంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇక ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ లో ఫహద్ చివర్లో పోలీస్ ఆఫీసర్ గా భన్వర్ సింగ్ షెకావత్ అనే పాత్రలో కనిపించాడు. ఈపాత్ర సెకండ్ పార్ట్ లో కీలకం కానుంది.అల్లు అర్జున్,ఫహద్ ఫాజిల్..పుష్ప ది రూల్ లో హోరాహోరీగా తలపడనున్నారు.

తేజ్ సత్య నుండి సాంగ్ టీజర్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. విరూపాక్ష, బ్రో సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాడు. అయితే బ్రో ప్రమోషన్స్ సమయంలో సాయి ధరమ్ తేజ్ తన తరువాత సినిమాకు గ్యాప్ తీసుకుంటున్నానని తెలిపాడు. ఇక ఇప్పుడు సత్య అంటూ వచ్చేస్తున్నాడు. నేడు దానికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు.

గేమ్ చేంజర్ షూటింగ్ అప్డేట్
ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్.ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది అయితే షూటింగ్ విషయంలో మాత్రం నెమ్మదించింది.ఈసినిమాతో పాటు శంకర్,కమల్ హాసన్ తో ఇండియన్ 2కూడా తీస్తుండడంతో గేమ్ చేంజర్ లేట్ అవుతుంది.ఇక ఈసినిమా కొత్త షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం కానుందని సమాచారం.ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా జాయిన్ కానున్నాడు.దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చినట్లే.అయితే ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కేవలం సాంగ్స్ కోసం భారీగా ఖర్చుపెడుతున్నాడు నిర్మాత.

జైలర్ అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్
గత కొంతకాలంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలకు సరైన బజ్ రాలేదు. దాంతో ఆ ప్రభావం ఓపెనింగ్స్ పడేది కానీ చాలా రోజుల తరువాత రజినీ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తానేంటో నిరూపిస్తున్నాడు. రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.ఈసినిమాకు కూడా నెల ముందు వరకు బజ్ నామమాత్రంగానే ఉండేది కానీ మొదటి సాంగ్ నువ్వు కావాలయ్యా రిలీజ్ అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఇక కొన్ని రోజుల ముందు రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఆ అంచనాలను రెట్టింపు చేసింది.దెబ్బకు భారీ హైప్ వచ్చింది.

గాండీవధారి అర్జున డబ్బింగ్ మొదలు పెట్టిన వరుణ్ -త్వరలో ట్రైలర్
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు. గని సినిమాతో ఫ్లాప్ ను మూటగట్టుకున్న వరుణ్ ఈసినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ను చూస్తుంటే వరుణ్ హిట్ కొట్టేలానే చూస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

జవాన్ నుండి షారుఖ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్
పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్. ఇక ఇప్పుడు అదే జోష్ తో జవాన్ అనే సినిమాతో వచ్చేస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈకాంబినేషన్ వల్ల సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికితోడు పఠాన్ లాంటి హిట్ తరువాత షారుఖ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే జవాన్ ప్రివ్యూ అంటూ వీడియోను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రీసెంట్ గాన్ దుమ్ము…