హీరోయిన్ తో పెళ్లి రూమర్స్ పై విశాల్ క్లారిటీ

vishal clarity on his marriage rumours with heroine lakshmi menon

తమిళ్ లో మోస్ట్ బ్యాచ్ లర్ హీరో ఎవరంటే విశాల్ అని చెప్పొచ్చు. అందుకే తన పెళ్లిపై వచ్చే వార్తలు ఎప్పుడూ వైరల్ గానే మారుతాయి. గతంలో విశాల్ కు ఎంగేజ్ మెంట్ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల వివాహం ఆగిపోయింది. కానీ విశాల్ పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒకవార్త తెరపైకి వస్తూనే ఉంటుంది. గతకొద్దిరోజుల క్రితం హీరోయిన్ అభినయతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆ వార్తలకు గాను త‌న‌కు అరెంజ్‌డ్ మ్యారేజ్ సెట్ కాద‌ని, ల‌వ్ మ్యారేజ్‌నే చేసుకోవాల‌ని ఉంద‌ని ఆయ‌న‌ అన్నారు. ప్రేమించిన అమ్మాయితోనే ఏడ‌డుగులు వేస్తా.. త్వ‌ర‌లోనే ఆమెను మీకు ప‌రిచ‌యం చేస్తాన‌ని చెప్పుకొచ్చాడు. దాంతో ఈవార్తలకు కొంతకాలం బ్రేక్ పడిది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరోసారి విశాల్ పెళ్లి వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈసారి విశాల్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్లు మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ రూమర్లపై విశాల్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. నిజానికి నామీద వచ్చే ఫేక్ న్యూస్ కు నేను ఎప్పుడూ రెస్పాండ్ అవ్వను.. కానీ ఇప్పుడు నా పెళ్లి రూమర్లు హీరోయిన్ అయిన లక్ష్మీ మీనన్ తో వస్తున్నాయి.. అయితే ఇవి ఫేక్ రూమర్స్. ఇక ఇప్పుడు ఈవార్తలపై నేను రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే.. ఒక హీరోయిన్ కంటే ముందే ఒక అమ్మాయి లైఫ్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి.. మీరు ఒక అమ్మాయి ప్రైవేట్ లైఫ్ పై అలానే ఆమె ఇమేజ్ కు భంగం కలిగిస్తున్నారు. నాపెళ్లి డేట్, టైమ్, సంవత్సరం డీకోడ్ చేయడానికి ఇదేమి బెర్ముడా ట్రయాంగిల్ కాదు.. టైమ్ వచ్చినప్పుడు నేనే నా పెళ్లికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇస్తాను అంటూ తెలిపాడు. మరి దీంతో ఇప్పటికైనా ఈ రూమర్లకు బ్రేక్ పడుతుందే చూద్దాం..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =