మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రం రేపు (ఆగస్టు 11, 2023) ప్రపంచవ్యాపంగా పెద్ద ఎత్తున విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో వేలాది మెగా అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించింది. హైదరాబాద్ వీధుల్లో మొత్తం 600 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. గురువారం ఉదయం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. మొత్తం జీపీఎస్ ట్రాకింగ్‌లో మెగాస్టార్ ముఖ చిత్రం కనిపించేలా ఈ ర్యాలీ చేపట్టడం విశేషం. అయితే ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో ఏ హీరో ఇలా జరుపుకోలేదని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర మాట్లాడుతూ.. ఇది కేవలం సినిమా ప్రమోషన్‌లో భాగం మాత్రమే కాదని, మెగాస్టార్ చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంటున్నామని తెలిపారు. ఇక ఈ సందర్భంగా చిరంజీవితో నటించిన నటీనటులు, ఆయన సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్లు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వీడియోలు పంపాల్సిందిగా ‘భోళాశంకర్’ నిర్మాతలు కోరారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినప్పటినుంచి అభిమానులు, సినీ ప్రేమికులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ‘భోళా మేనియా’ పేరుతో రకరకాల పోస్టులు షేర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ అభిమానులు 126 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. సూర్యాపేట-విజయవాడ జాతీయ రహదారిపై రాజు గారి తోట వద్ద దీనిని ఏర్పాటు చేశారు. కాగా టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ హీరోకి ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయలేదు. మరో విశేషం ఏంటంటే..? తన తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని చిరు ఈ భోళా శంకర్ సినిమాలో అనుకరించడం. దీంతో ఆయన అభిమానులతో పాటుగా సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. ఆయన చెల్లెలిగా కీర్తి సురేష్, మరో ప్రధాన పాత్రలో సుశాంత్ కనిపించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: