సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మాస్ స్ట్రైక్ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ అద్భుతమైన స్పందనతో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు మహేష్ పుట్టినరోజు కావడంతో బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే తెల్లవారు జామున ఈసినిమా నుండి ఒక మాస్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మాస్ అవతార్ లో ఉన్న మహేష్ లుక్ అయితే అదిరిపోయింది. ఇక ఇప్పుడు తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. జీన్స్, బ్లాక్ టీ షర్ట్ పై రెడ్ కలర్ షర్ట్, ఎర్రని తలపాగా తో ఉన్న ఈ ఫొటో కూడా ఆకట్టుకుంటుంది.
Wishing a very Happy Birthday to our highly Inflammable Super 🌟 @urstrulyMahesh garu. ⚡#HBDSuperstarMaheshBabu ✨#GunturKaaram #Trivikram @sreeleela14 @MusicThaman @meenakshiioffl @vamsi84 @NavinNooli #ASPrakash #GunturKaaramOnJan12th 🌶 pic.twitter.com/Ws7Xwd8QfD
— Haarika & Hassine Creations (@haarikahassine) August 9, 2023
ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: