కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ రిలీజ్ వాయిదా

dulquer salmaan king of kotha movie trailer release postponed

అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కింగ్ ఆఫ్ కోత. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా 80, 90 కాలం బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు హల్లా మచారే అనే పాటని విడుదల చేశారు మేకర్స్. ఎనర్జిటిక్ ఫుట్ టాపింగ్ గా ఉన్న ఈపాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈసినిమా ట్రైలర్ నేడు రిలీజ్ అవ్వాలి. అయితే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేశారు మేకర్స్. మలయాళం స్టార్ డైరెక్టర్ సిద్దిఖీ మరణించిన సంగతి తెలిసిందే కదా. గుండెపోటు రాగా కొచ్చిలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఇక సిద్దిఖీ మరణానికి గాను మలయాళం చిత్రపరిశ్రమ విషాదంలో ముగినిపోయింది. ఇక ఆయన మరణానికి గాను కింగ్ ఆఫ్ కోత చిత్రయూనిట్ నివాళులు అర్పిస్తూ ట్రైలర్ రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో తెలియచేయనున్నారు.

కాగా ఈసినిమాలో ఇంకా ప్రసన్న, నైలా ఉషా, చెంబన్ వినోద్‌, గోకుల్ సురేశ్‌, షమ్మీ తిలకన్‌, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్‌, అనిఖా సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేఫరెర్‌ ఫిలిమ్స్-జీ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. షాన్ రెహ్మాన్‌, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా..నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈసినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 9 =