కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 6

makers clarity on ayalaan movie release date again
రిలీజ్ అప్‌డేట్

అయలాన్ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన మేకర్స్

తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కూడా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు తన నుండి విభిన్నమైన కథతో రాబోతున్నసినిమా అయలాన్. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో ఎలియన్ కథాంశంతో సైన్స్ ఫిక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Bandla Ganesh Meets Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండ్ల గణేష్

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు ఆయనను కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే టాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు నూతన ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో తాజాగా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Teja Sajja Gives Clarity Over Competition with Mahesh Babu
సినిమా వార్తలు

మహేశ్‌ బాబుతో పోటీపై తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబుతో పోటీపడటంపై యువ నటుడు తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కాగా మహేశ్‌ బాబు హీరోగా చేస్తోన్న ‘గుంటూరు కారం’ మరియు తేజ సజ్జా ప్రధానపాత్రలో నటిస్తోన్న 'హనుమాన్' సినిమాలు ఈసారి సంక్రాతి బరిలో నిలిచాయి. ఈ రెండు చిత్రాలు ఒకేరోజు (జనవరి 12)న విడుదలవుతున్నాయి. దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు కారం’పై మహేశ్‌ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
raj tarun intro glimpse update from Naa Saami Ranga Movie
ట్రైలర్ & టీజర్

నా సామిరంగ- రాజ్ తరుణ్ ఇంట్రో గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ బిన్ని దర్శకత్వంలో కింగ్ నాగార్జున అక్కినేని హీరోగా వస్తున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న అల్లరి నరేష్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అల్లరి నరేష్ వీడియోతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు పాటలు కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే అనే పాటను అలానే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
S Thaman Praises Jr NTR Latest Look From Devara
ఫస్ట్ లుక్

ఎన్టీఆర్ లుక్ అదుర్స్.. దేవర పోస్టర్‌పై తమన్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. దీంతో దేవర సినిమా అప్‌డేట్స్ గురించి తారక్ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కాగా దేవర నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి. జూ. ఎన్టీఆర్‌ సహా సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజైన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
bellamkonda srinivas 10th movie title and first look update
ట్రైలర్ & టీజర్

బెల్లంకొండ శ్రీనివాస్ న్యూ మూవీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రామిసింగ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. హీఎస్ఎస్10 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా పలు కీలకమైన షెడ్యూల్స్ ను సైతం ముగించుకుంది. ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు. ఈసినిమాా ఫస్ట్ లుక్, గ్లింప్స్ ను జనవరి 3వ తేదీన శ్రీనివాస్ బెల్లంకొండ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Jr NTR Returns Home Safely From Japan Amid Multiple Earthquakes
సినిమా వార్తలు

జపాన్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన ఎన్టీఆర్.. వరుస భూకంపాలపై దిగ్భ్రాంతి

c కాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గతవారం జూ. ఎన్టీఆర్ కుటుంబసమేతంగా జపాన్ వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న అర్ధరాత్రి తిరిగి ఇండియా చేరుకున్నారు. ఈ సందర్భంగా తాను క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు సోమవారం (జనవరి 1) అర్ధరాత్రి దాటిన తర్వాత తారక్ తెలిపాడు. ఈ మేరకు ఆయన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టాడు.

Srikanth Mవాట్సాప్
special poster released from Geethanjali Malli Vachindi
ఫస్ట్ లుక్

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

అంజ‌లి ప్ర‌ధాన పాత్రలో వచ్చిన కామెడీ ప్లస్ హార్రర్ మూవీ 'గీతాంజ‌లి' సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి కూడా విదితమే.‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈసీక్వెల్ రానుంది. శివ తుర్ల‌పాటి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. అంతేకాదు అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా కావడంతో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈసినిమా టైటిల్ ను రీసెంట్ గానే ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Prabhas Thanks To His Fans For Making Salaar A Big Success
సినిమా వార్తలు

స‌లార్ గ్రాండ్ స‌క్సెస్‌.. ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెప్పిన ప్ర‌భాస్

టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘సలార్‌’. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా దానికి తగ్గట్లే థియేటర్లలో భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. మరోవైపు ప్రభాస్ కటౌట్‌కి సరిగ్గా సరిపోయే సినిమా ఇదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ప్రభాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీన్స్ అన్నీ కలగలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కు రూ. 500 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
hi nanna cross 75cr mark
సినిమా వార్తలు

75కోట్లు దాటిన హాయ్ నాన్న

నాని హాయ్ నాన్న నిన్నటి తో 75కోట్ల మార్క్ ను చేరుకుందని నిర్మాతలు ప్రకటించారు.గత నెలలో విడుదలైన ఈసినిమాకు మౌత్ టాక్ సూపర్ గా రావడంతో రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ సూపర్ హిట్ అనిపించుకుంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.ఇప్పటికీ వీకెండ్ లో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.అయితే ఈనెల 4న ఈసినిమా ఓటిటి లో విడుదలకానుందని నెట్ ఫ్లిక్స్ రెండు రోజుల క్రితం ప్రకటించింది.దాంతో ఇంక థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లే.

Mahender Reddyవాట్సాప్
saindhav movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

సైంధవ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రాంగ్ యూసేజ్ లాంటి పెప్పీ సాంగ్ ను అలానే బుజ్జి కొండవే లాంట్ ఎమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైపోయింది.

TFN Adminవాట్సాప్
Naa SaamiRanga releasing on January 14th
రిలీజ్ అప్‌డేట్

నా సామి రంగ రిలీజ్ డేట్ ఫిక్స్

కింగ్ నాగార్జున నా సామి రంగ అనుకున్న సమయానికే వస్తుంది.ఈసినిమా అనౌన్స్ చేసినప్పుడే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేశారు.అయితే ఆ టైంకు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంటుందో లేదో అని మధ్యలో డౌట్ క్రియేట్ చేసింది.కానీ సంక్రాంతి సీజన్ బాగా కలిసి రావడంతో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావొద్దని నాగార్జున పట్టు బట్టాడు.టీం కూడా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయడంతో సంక్రాంతికి రావడం ఫిక్స్ అయిపోయింది.

Mahender Reddyవాట్సాప్
akash goparaju sarkaaru noukari movie telugu review
రివ్యూ

సర్కారు నౌకరి రివ్యూ..మంచి సందేశాత్మక సినిమా

ఓవరాల్ గా చెప్పాలంటే సర్కారు నౌకరి ఒక మంచి సందేశాత్మక సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగి పోయిన రోజులు.. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉన్న రోజులు కాబట్టి ఏ విషయం అయినా నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. కానీ అప్పట్లో ఎలాంటి సోషల్ మీడియా లేదు. ఆరోజుల్లో ప్రజలకు అవగాహన కల్పించడం అంటే మాములు విషయం కాదు. అలాంటి విషయాలను అప్పుడప్పుడు ఇలా సినిమాల ద్వారా చూపిస్తే కాస్త ఆలోచిస్తారు. అలాంటి ప్రయత్నమే ఈసినిమా. ఈసినిమాను అన్ని వర్గాల వారు ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

TFN Adminవాట్సాప్
intresting title for thalapathy 68
సినిమా వార్తలు

విజయ్ 68కి సూపర్ టైటిల్

గత ఏడాది లియోతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు తమిళ స్టార్ హీరో విజయ్.ప్రస్తుతం ఈహీరో తన 68వసినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమాకి సూపర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.వెంకట్ ప్రభు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో ఈ కాంబో ఫై మొదటినుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఇప్పుడు టైటిల్ ను కూడా ఆ అంచనాలకు తగ్గట్లే ఫిక్స్ చేశారు.ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (ది గోట్ ) అనే టైటిల్ ను ఖరారు చేశారు.

Mahender Reddyవాట్సాప్
jr ntr devara movie glimpse release date fixed
ట్రైలర్ & టీజర్

దేవర గ్లింప్స్ రిలీజ్ డేట్ వచ్చేసింది

ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఇంతవరకూ ఎన్టీఆర్ నుండి సినిమా రాలేదు. దీంతో తమ అభిమాన హీరోని సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా రోజులు అవ్వడంతో ఎప్పుడెప్పుడు ఈసినిమా రిలీజ్ అవుతుదా అని చూస్తున్నారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈసినిమాలో విజువల్స్ వండర్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాయి. ఆదిశగానే చిత్రయూనిట్ కూడా పనిచేస్తుంది.

TFN Adminవాట్సాప్
natural nani reaction on roshan bubble gum movie
సినిమా వార్తలు

బబుల్ గమ్ రిజల్ట్ పై నాని రియాక్షన్

బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా బబుల్ గమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈసినిమా వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా రోషన్ నటనకు మంచి అప్లాజ్ దక్కుతుంది.

TFN Adminవాట్సాప్
bobby deol joins in NBK 109 movie
సినిమా వార్తలు

NBK 109 లో పవర్ ఫుల్ విలన్

నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇప్పటికే ఊటీ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకుంది.

TFN Adminవాట్సాప్
Kalyan Ram Comments On Devil 2 Movie
సినిమా వార్తలు

డెవిల్ 2 ఖచ్చితంగా ఉంటుంది

ఈమధ్య కాలంలో ఒక సినిమాకు సీక్వెల్స్ రావడం కామన్ అయిపోయింది. సినిమా హిట్ అయితే చాలు సీక్వెల్స్ ను చేసేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు సీక్వెల్స్ కు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా సీక్వెల్ కు కన్ఫామ్ అయిపోయింది. ఆ సినిమా మరేదో కాదు కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన డెవిల్ మూవీ. అభిషేక్ నామా దర్శకత్వంలో 1940 కాలం బ్రిటీష్ పరిపాలనా కాలం నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. సుభాష్ చంద్రబోస్, అతని అనుచరులని బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, మరో వైపు హత్య కేసు ఛేదించడం.. ఇలా డెవిల్ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇక నిన్న రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని…

TFN Adminవాట్సాప్
roshans bubble gum movie review
రివ్యూ

రోషన్ బబుల్ గమ్ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే అందరూ కలిసి చూసే సినిమా అని చెప్పలేం కానీ ఈసినిమా యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడం కొంచం కష్టం..

TFN Adminవాట్సాప్
Nagarjuna Akkineni and Amala Meets Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున, అమల దంపతులు

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఆయన తన భార్య అమలతో కలిసి శనివారం ఉదయం హైదరాబాద్ జూబిలీహిల్స్‌‌లోని సీఎం నివాసానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగార్జున దంపతులు సీఎం రేవంత్‌ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు శుభాభినందనలు తెలియజేశారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Srikanth Mవాట్సాప్

షేర్