ఎన్టీఆర్ లుక్ అదుర్స్.. దేవర పోస్టర్‌పై తమన్ కామెంట్స్

S Thaman Praises Jr NTR Latest Look From Devara

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. దీంతో దేవర సినిమా అప్‌డేట్స్ గురించి తారక్ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కాగా దేవర నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి. జూ. ఎన్టీఆర్‌ సహా సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజైన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి తాజాగా కొత్త పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు మేకర్స్. నూతన సంవత్సరం సందర్బంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో తారక్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో దీనిపై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. అందులో.. ” ‘దేవర’ పోస్టర్ చూశాను. మాగ్నానిమస్‌గా ఉంది. మై డియరెస్ట్ తారక్ అన్న లుక్ అదిరిపోయింది. 8వ తేదీ వరకు వెయిట్ చేయలేను. బ్రదర్ అనిరుధ్ అద్భుతమైన మ్యూజిక్‌తో దేవర బ్లాక్ బస్టర్ అవనుంది” అని పేర్కొన్నారు.

కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర’ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ క్రమంలో మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రానికి శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా.. సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా తర్వాత తారక్ ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించనున్నారు. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ భారీ చిత్రం చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =