కింగ్ నాగార్జున నా సామి రంగ అనుకున్న సమయానికే వస్తుంది.ఈసినిమా అనౌన్స్ చేసినప్పుడే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేశారు.అయితే ఆ టైంకు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంటుందో లేదో అని మధ్యలో డౌట్ క్రియేట్ చేసింది.కానీ సంక్రాంతి సీజన్ బాగా కలిసి రావడంతో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావొద్దని నాగార్జున పట్టు బట్టాడు.టీం కూడా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయడంతో సంక్రాంతికి రావడం ఫిక్స్ అయిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా జనవరి 14న విడుదలకానుందని టైటిల్ సాంగ్ విడుదల సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.ఇక ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రామిసింగ్ గా వుంది.నాగ్ అయితే సినిమాఫై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.మరోవైపు హిట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ నా సామి రంగ వారి కోరికను తీర్చేలానే వుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి.రూరల్ బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరోలు నరేశ్,రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ఫై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: