బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా బబుల్ గమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈసినిమా వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా రోషన్ నటనకు మంచి అప్లాజ్ దక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాపై తాజాగా న్యాచురల్ స్టార్ నాని కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ అభినందించారు. బబుల్ గమ్ సినిమాకు వస్తున్న పాజిటివ్ రివ్యూలను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది.. అలానే రోషన్ పెర్ఫామెన్స్ కు కూడా మంచి అప్లాజ్ వస్తుంది.. అలానే లవ్ ఇంకా సెల్ఫ్ రెస్పక్ట్ ఇప్పుడు వస్తున్న యంగ్ స్టర్స్ లో కనిపిస్తుంది.. డైరెక్టర్ రవికాంత్ ఇంకా చిత్రయూనిట్ కు కంగ్రాట్స్ అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.
Hearing good things about #Bubblegum and @RoshanKanakala ‘s performance. Love or self respect is a theme which resonates with youngsters. Congratulations @ravikanthperepu and team 🤗
— Hi Nani (@NameisNani) December 30, 2023
కాగా మానస చౌదరి హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో హర్ష వర్ధన్, అను హాసన్ కీలకపాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈసినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రఫి..శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: