ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఇంతవరకూ ఎన్టీఆర్ నుండి సినిమా రాలేదు. దీంతో తమ అభిమాన హీరోని సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా రోజులు అవ్వడంతో ఎప్పుడెప్పుడు ఈసినిమా రిలీజ్ అవుతుదా అని చూస్తున్నారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈసినిమాలో విజువల్స్ వండర్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాయి. ఆదిశగానే చిత్రయూనిట్ కూడా పనిచేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి గ్లింప్స్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని ఈసినిమా నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ ఓ ఈవెంట్ లో చెప్పిన సంగతి తెలిసిందే కదా. అప్పటినుండి ఫ్యాన్స్ గ్లింప్స్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా కొత్త సంవత్సరం రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలుపుతూ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. జనవరి 8వ తేదీన గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ్లింప్స్ కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! Wishing you all a very Happy New Year.
Can’t wait for you all to experience the glimpse of #Devara on Jan 8th. pic.twitter.com/RIgwmVA6e0
— Jr NTR (@tarak9999) January 1, 2024
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: