టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఆయన తన భార్య అమలతో కలిసి శనివారం ఉదయం హైదరాబాద్ జూబిలీహిల్స్‌లోని సీఎం నివాసానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు శుభాభినందనలు తెలియజేశారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా గత నెలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యలోనే సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డికి సినిమా పరిశ్రమ సహా అన్ని వర్గాల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవలే టాలీవుడ్ నుంచి మొదటగా మెగాస్టార్ చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: