అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన కామెడీ ప్లస్ హార్రర్ మూవీ ‘గీతాంజలి’ సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి కూడా విదితమే.‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈసీక్వెల్ రానుంది. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. అంతేకాదు అంజలి నటిస్తోన్న 50వ సినిమా కావడంతో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈసినిమా టైటిల్ ను రీసెంట్ గానే ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా న్యూ ఇయర సందర్బంగా ఈసినిమా నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పాడుబడ్డ భవంతిలో నాట్య కళాకారిణి లుక్‌లో అంజలి కనిపిస్తోంది. ఓ వైపు అంజలి లుక్.. మరో వైపు భవంతి బ్యాక్ డ్రాప్ చూస్తుంటే సరికొత్త కథ, కథనంతో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమైందని తెలుస్తోంది.
Ring in 2024 with chills and thrills 👻
Special look of #GeethanjaliMalliVachindhi to give a hauntingly beautiful start to the New Year 🤩
Wishing everyone a Happy New Year 🥳#Anjali50 @yoursanjali @MP_MvvOfficial @konavenkat99 #GV #ShivaTurlapati @Plakkaraju #SujathaSiddarth pic.twitter.com/RwkbBYrxpf
— Kona Film Corporation (@KonaFilmCorp) January 1, 2024
కాగా ఈసినిమాలో ఇంకా మలయాళ నటుడు రాహుల్ మాధవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్‌లో సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు రాహుల్. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: