ఈమధ్య కాలంలో ఒక సినిమాకు సీక్వెల్స్ రావడం కామన్ అయిపోయింది. సినిమా హిట్ అయితే చాలు సీక్వెల్స్ ను చేసేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు సీక్వెల్స్ కు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా సీక్వెల్ కు కన్ఫామ్ అయిపోయింది. ఆ సినిమా మరేదో కాదు కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన డెవిల్ మూవీ. అభిషేక్ నామా దర్శకత్వంలో 1940 కాలం బ్రిటీష్ పరిపాలనా కాలం నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. సుభాష్ చంద్రబోస్, అతని అనుచరులని బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, మరో వైపు హత్య కేసు ఛేదించడం.. ఇలా డెవిల్ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇక నిన్న రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో మీడియాతో ముచ్చటించిన కళ్యాణ్ రామ్ డెవిల్ 2పై క్లారిటీ ఇచ్చాడు. డెవిల్ 2 ఖచ్చితంగా ఉంటుంది.. ఇదే టీమ్ తో ఉంటుంది.. నిజానికి డెవిల్ 2 ఐడియా ముందునుండే ఉంది.. డెవిల్ సినిమా స్టార్ట్ చేసిన 10 రోజులకే ఈసినిమా సీక్వెల్ గురించి అనుకున్నాం.. 2024 లో ఈసినిమా ఉంటుంది.. 2025లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తాం.. సీక్వెల్ లో రెండు కాలాలకు సంబంధించిన కథ ఉంటుంది.. 1940 తో పాటు 2000 కాలం కూడా చూపిస్తాం అని క్లారిటీ ఇచ్చాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: