మహేశ్‌ బాబుతో పోటీపై తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Teja Sajja Gives Clarity Over Competition with Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబుతో పోటీపడటంపై యువ నటుడు తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కాగా మహేశ్‌ బాబు హీరోగా చేస్తోన్న ‘గుంటూరు కారం’ మరియు తేజ సజ్జా ప్రధానపాత్రలో నటిస్తోన్న ‘హనుమాన్’ సినిమాలు ఈసారి సంక్రాతి బరిలో నిలిచాయి. ఈ రెండు చిత్రాలు ఒకేరోజు (జనవరి 12)న విడుదలవుతున్నాయి. దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు కారం’పై మహేశ్‌ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే మరోవైపు చిన్న సినిమానే అయినప్పటికీ స్టోరీ పరంగా అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్స్‌తో ‘హనుమాన్’ కూడా మూవీ లవర్స్‌ దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈసారి మహేశ్‌ బాబు, తేజ సజ్జా సినిమాలు ఒకేరోజు విడుదలవుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా హీరో తేజకి మహేశ్‌ బాబుతో పోటీగా మీ సినిమా రిలీజ్ చేస్తున్నారెందుకని ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. తనకు మహేశ్‌తో పోటీ కాదని, మహేశ్‌తో పాటుగా అని వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం తేజ సజ్జా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇది ఇంత చర్చనీయాంశం కావడానికి కారణం.. గతంలో తేజ సజ్జా మహేశ్ బాబు సినిమాలో బాలనటుడిగా నటించడం. మహేశ్ కెరీర్ ప్రారంభించిన సమయంలో ప్రముఖ దర్శకుడు వైవీయస్ చౌదరి రూపొందించిన ‘యువరాజు’ అనే చిత్రం చేశారు. ఈ సినిమాలో మహేశ్ కొడుకు పాత్రలో తేజ సజ్జా కనిపించడం విశేషం. ఈ నేపథ్యంలోనే తాజాగా వీరిద్దరి చిత్రాలు ఇలా ఒకేరోజు విడుదల కానుండటం గమనార్హం. ఈ సందర్భంగా మహేశ్‌తో పోటీ పడుతున్నారన్న వ్యాఖ్యలపై తేజ సజ్జా వివరణ ఇచ్చారు. కాగా తేజ వివరణపై మహేశ్ అభిమానులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + six =