
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 5



నైజాంలో సలార్ 100కోట్లు

నా సామిరంగ.. రాజ్ తరుణ్ ఇంట్రో వీడియో రిలీజ్

అయలాన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టైసన్ నాయుడు గా వస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్

గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పిన నాగవంశీ

యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న సైంధవ్ ట్రైలర్

పుష్ప 2 రిలీజ్ డేట్ పై క్లారిటీ

తండేల్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇండియన్ 2.. ఫైనల్లీ షూటింగ్ కంప్లీట్

యాత్ర 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

డెవిల్ 4డేస్ కలెక్షన్స్

నమ్రతతో మహేశ్ బాబు లవ్లీ పిక్.. నెట్టింట వైరల్

మట్కా కోసం టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

యూఎస్ లో డెవిల్ సత్తా.. సెకండ్ హయ్యస్ట్ గ్రాస్ మూవీగా రికార్డ్
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించాడు.ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన సినిమా కాబట్టి అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే రోజు రోజుకీ కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.

వెంకటేష్ గారికి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా సరిపోదు - డైరెక్టర్ శైలేష్ కొలను
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సైంధవ్'. వెంకటేష్ కెరీర్‌లో మైల్ స్టోన్ ప్రాజెక్ట్ 75వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. 'సైంధవ్' చిత్రంలో 'జెర్సీ' ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్రను పోషించారు. అన్ని ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకొని సంక్రాంతికి జనవరి 13 న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ సమీపిస్తున్నందున చిత్రబృందం ప్రమోషన్స్‌ను ముమ్మురం చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్, పాటలు రిలీజ్ చేయగా…

నైజాంలో సలార్ 100కోట్లు
ప్రభాస్ సలార్ నైజాం లో సరికొత్త రికార్డు సృష్టించింది.నిన్నటి తో ఈసినిమా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది దాంతో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా ఘనత సాధించింది.ఇంతకుముందు బాహుబలి 2,ఆర్ఆర్ఆర్ ఈరికార్డు ను చేరుకున్నాయి.ఇక సలార్ నైజాం లో డ్రీం రన్ ను కొనసాగిస్తోంది.ప్రభాస్ కు నైజాంలో సాలిడ్ ట్రాక్ రికార్డు వుంది. ఇంతకుముందు ప్లాప్ సినిమాలు కూడా మంచి వసూళ్లను రాబట్టాయి.ఇప్పుడు సలార్ కు హిట్ టాక్ రావడంతో ఏకంగా 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను కూడా క్రాస్ చేసింది.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నైజాం లో రిలీజ్ చేసింది.

75వ చిత్రంగా ‘సైంధవ్’ లాంటి సినిమా చేయడం నా అదృష్టం - వెంకటేష్
విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం 'సైంధవ్'. ఇది వెంకటేష్ కెరీర్‌లో మైల్ స్టోన్ ప్రాజెక్ట్ 75వ చిత్రంగా తెరకెక్కుతోంది. యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. 'సైంధవ్' చిత్రంలో 'జెర్సీ' ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్రను పోషిస్తున్నారు. అన్ని ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకొని సంక్రాంతికి జనవరి 13 న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ సమీపిస్తున్నందున చిత్రబృందం ప్రమోషన్స్‌లో మరింత దూకుడు పెంచిది.

అప్ కమింగ్ సినిమాలపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సక్సెస్ తో హ్యాపీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈసినిమా వచ్చింది. ఈ సినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా మొదటగా సలార్.. సీజ్ ఫైర్ తో మొదటి పార్ట్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చూశాం. ఎప్పటినుండో ప్రభాస్ ను ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ నే అందించాడు ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తుంది సలార్ పార్ట్ 2 కోసం.

నా సామిరంగ.. రాజ్ తరుణ్ ఇంట్రో వీడియో రిలీజ్
విజయ్ బన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. చాలా రోజుల తరువాత నాగార్జున మళ్లీ ఈసినిమాలో మాస్ రోల్ తో ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. దీంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమాలో అల్లరి నరేష్ ఇంకా రాజ్ తరుణ్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే అల్లరి నరేష్ పాత్రను పరిచయం చేశారు మేకర్స్. అంజి అనే పాత్రలో నటిస్తున్నాడు అల్లరి నరేష్. నిజానికిి అల్లరి నరేష్ ఇంట్రో వీడియో వల్ల సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఇప్పుడు రాజ్ తరుణ్ ఇంట్రడక్షన్ వీడియోను కూడా రిలీజ్ చేశారు…

ఎవరో ఒకరు త్రివిక్రమ్, సందీప్ వంగాలకు కాల్ చేసి అడగండమ్మా - వెంకటేష్
విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం 'సైంధవ్'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు 'హిట్' ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో 'జెర్సీ' ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్రను పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్, పాటలు రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను అలరించాయి.

అయలాన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా అయలాన్. ఆర్ రవి కుమార్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ పై కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసినిమా పొంగల్ కే రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ తెలియచేశారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్…

టైసన్ నాయుడు గా వస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్
అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తరువాత పలు సినిమాలు చేసినా సాలిడ్ హిట్ కొట్టింది లేదు. అయితే తమిళ్ లో సూపర్ హిట్ అయిన రాచ్చసన్ సినిమాను తెలుగులో రాక్షసుడు సినిమాగా రీమేక్ చేసి ఆ సినిమాతో కాస్త హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఛత్రపతి రీమేక్ చేసి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా నిరాశనే మిగిల్చింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా ఒక పవర్ ఫుల్ మూవీ తెరకెక్కనుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.

గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పిన నాగవంశీ
సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, అలానే దమ్ మసాలా సాంగ్ అలానే ఓ మై బేబీ, కుర్చీ మడత పెట్టి అనే పాటలను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న సైంధవ్ ట్రైలర్
టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అంతేకాదు ఓటీటీలో కూడా తన ఎంట్రీ ఇప్పటికే ఇచ్చేశారు. రానా నాయుడు అంటూ వచ్చిన ఈ వెబ్ సిరీస్ బాగానే ఆకట్టుకుంది. అయితే వెంకీని సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా రోజులైపోయింది. దీంతో వెంకీ సినిమాకోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వెంకీ నుండి మరికొద్ది రోజుల్లో రాబోతున్న సినిమా సైంధవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కింది. చాలా కాలం తర్వాత యాక్షన్ మూవీతో వెంకటేష్ వస్తుండటం మరోవైపు.. తండ్రీ,కూతుళ్ల సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ఉండటంతో సైంధవ్‍కు చాలా క్రేజ్ పెరిగింది.

పుష్ప 2 రిలీజ్ డేట్ పై క్లారిటీ
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈసినిమాకు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటివరకూ కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

తండేల్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఈమధ్యనే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. షూటింగ్ మొదలుపెట్టినప్పుటినుండీ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. ఈసినిమా షూటింగ్ ఉడిపిలో మొదలవ్వగా రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ లో సాయి పల్లవి కూడా జాయిన్ అయినట్టు తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మాత బెల్లంకొండ సురేష్
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మాత బెల్లంకొండ సురేష్ అలాగే టాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు నూతన ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.

ఇండియన్ 2.. ఫైనల్లీ షూటింగ్ కంప్లీట్
లోకనాయకుడు కమల్ మాత్రం ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం కమల్ లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా.. అందులో ఇండియన్ 2 సినిమా కూడా ఒకటి. నిజానికి ఈసినిమా మొదలై దాదాపు రెండేళ్లు అయిపోతుంది. మొదటగా షూటింగ్ బాగానే ఉన్నా ఆ తరువాత షూట్ లో ప్రమాదం జరగడంతో బ్రేక్ పడింది. ఆ తరువాత శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా కమిట్ అయ్యారు. అప్పట్లో దీనిపై కేసు వేయడం.. ఆతరువాత రాజీకి రావడం జరిగిందనుకోండి. దాంతో అంటు ఇండియన్ 2, ఇటు గేమ్ ఛేంజర్ రెండు సినిమాల షూటింగ్ లు పార్లల్ గా చేసుకోవడం మొదలుపెట్టాడు. అలా రెండు సినిమాల షూటింగ్ లను ఒకదాని తరువాత ఒకటి చేస్తూ వస్తున్నారు…

విజయ్ GOAT.. ఇంట్రెస్టింగ్ గా సెకండ్ లుక్
దళపతి విజయ్ తన తరువాత సినిమా వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు విజయ్ 68 అనే టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పుడు తాజాగా సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో కూడా యంగ్ విజయ్ కాస్త ఓల్డ్ విజయ్ కనిపిస్తున్నారు. ఇద్దరూ బుల్లెట్ రైడ్ చేస్తూ.. గన్ ఫైర్ చేస్తున్నారు. ఓ వైపు పిస్తోల్, మరోవైపు గన్‌ను పేలుస్తూ కనిపిస్తున్నారు.

యాత్ర 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో చోటుచేసుకున్న కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'యాత్ర 2'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన 'యాత్ర' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాత్రలో నటిస్తుండగా.. ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పటికే 'యాత్ర 2' నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి.

డెవిల్ 4డేస్ కలెక్షన్స్
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించాడు. ఈసినిమా గ్లింప్స్, టీజర్, ట్రైలర్స్‌తోనే రిలీజ్ కు ముందే మంచి బజ్ క్రియేట్ చేయడం.. దానికి తోడు బింబిసార ప్రభావం వల్ల ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

నమ్రతతో మహేశ్ బాబు లవ్లీ పిక్.. నెట్టింట వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఫ్యామిలీకి తగిన సమయం కేటాయిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఒకవైపు ప్రొఫెషనల్ కెరీర్‌ని, అలాగే మరోవైపు పర్సనల్ లైఫ్‌ని ఆయన సమంగా బ్యాలన్స్ చేస్తుంటారు. ఈ విషయంలో చాలామందికి మహేశ్ బాబు ఇన్స్పిరేషన్‌గా నిలుస్తారంటే అతిశయోక్తి కాదు. మూవీ షూటింగులతో బిజీగా నిత్యం ఉండే ఆయన ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఇక నూతన సంవత్సర వేడుకలను ఎక్కువగా విదేశాల్లో జరుపుకోవడం మహేశ్‌కి అలవాటు. దీనిలో భాగంగా ఈసారి మహేశ్ బాబు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లారు.