నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇప్పటికే ఊటీ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో విలన్ బాబి డియోల్ విలన్ గా నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆవార్తలకు క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా తన ట్విట్టర్ ద్వారా తాను ఇంకా బాబి డియోల్ ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ బాలకృష్ణ 109లో నటిస్తున్నట్టు తెలిపింది. మరి యానిమల్ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు బాబి డియోల్. దీంతో బాలకృష్ణ సినిమాలో బాబి డియోల్ నటిస్తుండటంతో అప్పుడే సినిమాపై క్రేజ్ పెరిగింది.
Thrilled to welcome Lord @thedeol to our #NBK109 film family 💜 Gratitude to Deol family for launching me in the world of cinema & now can’t wait to share screen space with you in #NBK109 post #SinghSaabTheGreat 🎥 #HappyNewYear Guys 🎉 🎈🎊
☆
☆
☆
☆
☆
☆
☆
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) December 29, 2023
కాగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కాగా చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాకి దర్శకత్వాన్ని వహించిన బాబీ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో ఇప్పుడు బాలయ్య సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: