నా సామిరంగ- రాజ్ తరుణ్ ఇంట్రో గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

raj tarun intro glimpse update from Naa Saami Ranga Movie

విజయ్ బిన్ని దర్శకత్వంలో కింగ్ నాగార్జున అక్కినేని హీరోగా వస్తున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న అల్లరి నరేష్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అల్లరి నరేష్ వీడియోతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు పాటలు కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే అనే పాటను అలానే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో రాజ్ తరుణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో రాజ్ తరుణ్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. రాజ్ తరుణ్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను జనవరి 3వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈసినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా సంక్రాంతి కానుకగా జవవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + nineteen =