75కోట్లు దాటిన హాయ్ నాన్న 

hi nanna cross 75cr mark

నాని హాయ్ నాన్న నిన్నటి తో 75కోట్ల మార్క్ ను చేరుకుందని నిర్మాతలు ప్రకటించారు.గత నెలలో విడుదలైన ఈసినిమాకు మౌత్ టాక్ సూపర్ గా రావడంతో రోజు రోజుకు  కలెక్షన్స్ పెంచుకుంటూ సూపర్ హిట్ అనిపించుకుంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.ఇప్పటికీ  వీకెండ్ లో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.అయితే ఈనెల 4న ఈసినిమా ఓటిటి లో విడుదలకానుందని నెట్ ఫ్లిక్స్  రెండు రోజుల క్రితం ప్రకటించింది.దాంతో ఇంక థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గత ఏడాది నానికి సూపర్ గా కలిసొచ్చింది.సమ్మర్ లో దసరా అంటూ మాస్ ఎంటర్టైనర్ తో వచ్చి బ్లాక్ బాస్టర్ కొట్టాడు.ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.ఇక చివర్లో హాయ్ నాన్న తో సూపర్ హిట్ అందుకున్నాడు.

ప్రస్తుతం నాని సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు.వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.రీసెంట్ గానే  రెండో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.దానయ్య డివివి నిర్మిస్తున్నాడు.ఈసమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.మరి ఈసినిమాతో నాని హ్యాట్రిక్ కొడతాడా లేదో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − nineteen =