స‌లార్ గ్రాండ్ స‌క్సెస్‌.. ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెప్పిన ప్ర‌భాస్

Prabhas Thanks To His Fans For Making Salaar A Big Success

టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘సలార్‌’. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే ఈ చిత్రంపై  భారీ అంచనాలు నెలకొనగా దానికి తగ్గట్లే థియేటర్లలో భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. మరోవైపు ప్రభాస్ కటౌట్‌కి సరిగ్గా సరిపోయే సినిమా ఇదంటూ డార్లింగ్ ఫ్యాన్స్  సంబరపడుతున్నారు.  ప్రభాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీన్స్ అన్నీ కలగలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కు రూ. 500 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా.. సలార్ మూవీ యూనిట్ అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ అందించింది. గ్రాండ్ స‌క్సెస్‌ సాధించిన నేపథ్యంలో హీరో ప్రభాస్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ మేరకు ఆయన నూతన సంవత్సరాన్ని (2024, జ‌న‌వ‌రి 1) పురస్కరించుకుని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా త‌న ఫ్యాన్స్‌కి న్యూ ఇయ‌ర్ విషెస్ కూడా చెప్పాడు. అందులో..”నేను ఖాన్సార్ భవిష్య‌త్తును నిర్ణయిస్తాను. మీరు సంతోషంగా న్యూ ఇయ‌ర్ ఎంజాయ్ చేయండి డార్లింగ్స్‌.. స‌లార్ సీజ్‌ఫైర్‌ను మీ సినిమాగా భావించి గ్రాండ్ స‌క్సెస్ అందించినందుకు థ్యాంక్యూ” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)


మరోవైపు న్యూ ఇయ‌ర్ స్పెష‌ల్‌గా ఈ మూవీ నుంచి స‌రికొత్త ప్రోమో విడుద‌ల చేశారు. వెల‌మ్‌గ‌డి ప్రోమో పేరుతో విడుద‌ల చేసిన 29 సెకండ్ల నిడివి గల ఈ ప్రోమో ప్ర‌స్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. శాండల్‌వుడ్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ ముఖ్య పాత్రలో కనిపించరు. అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, బాబి సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్‌, సప్తగిరి, సిమ్రత్‌ కౌర్‌, పృథ్విరాజ్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు భువన్ గౌడ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై ‘కె.జి.యఫ్’, ‘కాంతారా’ వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీస్ రూపొందించిన విజయ్‌ కిరగందూర్‌ గ్రాండ్‌గా నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + seventeen =