శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రాంగ్ యూసేజ్ లాంటి పెప్పీ సాంగ్ ను అలానే బుజ్జి కొండవే లాంట్ ఎమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమా నుండి కూడా అప్ డేట్ వచ్చేసింది. ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. జనవరి 3వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు తెలియచేశారు.
#SAINDHAV & #GayathriPapa wishes you a very #HappyNewYear2024 ❤️🔥
Igniting the NEW YEAR vibe with #SaindhavTrailer on JAN 3rd 💥💥💥
In Theatres from JAN 13th, 2024🔥#SaindhavOnJAN13th
Victory @VenkyMama #SsaraPalekar @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath… pic.twitter.com/tYa3ywblDG
— Niharika Entertainment (@NiharikaEnt) January 1, 2024
కాగా ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: