తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు ఆయనను కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే టాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు నూతన ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో తాజాగా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోమవారం (జనవరి 01, 2024) నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బండ్ల గణేష్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్చంతో పాటు ఒక మొక్కను అందించిన బండ్ల గణేష్.. న్యూ ఇయర్ విషెస్‌తో పాటు సీఎం పదవి చేపట్టింనందుకు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సందర్భంగా చిత్రపరిశ్రమకు సంబంధించిన పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా బండ్ల గణేష్ కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మద్దతుదారుడిగా ఉన్న విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: