
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 39


లియో సెన్సేషన్ యూకే కలెక్షన్స్

జెంటిల్‌మెన్ 2 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి


బేబి టీమ్ తో సంతోష్ శోభన్- ఇంటెన్స్ గా ప్రీ లుక్

కన్నప్ప షూటింగ్ లో ప్రమాదం- గాయపడ్డ విష్ణు

ఫైనల్లీ వచ్చేసిన జిగర్ తండ డబల్ ఎక్స్ రిలీజ్ డేట్

జపాన్ ట్రైలర్ రిలీజ్

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్ రిలీజ్
యంగ్ హీరో నితిన్ ,నాపేరు సూర్య డైరెక్టర్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచగా రీసెంట్ గా విడుదలైన డేంజర్ పిల్లా అనే పాట కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.వీటికి తోడు సీనియర్ హీరో,యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ విలన్ గా నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక ఈసినిమా నుండి తాజాగా టీజర్ కూడా విడుదలచేశారు.

లియో సెన్సేషన్ యూకే కలెక్షన్స్
విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా లియో. విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఈసినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఇక ఫైనల్ గా అక్టోబర్ 20వ తేదీన ఈసినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది అయినా కూడా ఈసినిమా కలెక్షన్స్ లో మాత్రం ఎక్కడా రాజీపడలేదు. కేవలం 6 రోజుల్లోనే ఈసినిమా 500 కోట్లను సొంతంచేసుకుంది.

మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్
చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది మ్యాడ్.ఈనెల 6న విడుదలైన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ఏ లోనూ 500k డాలర్ల ను రాబట్టి హిట్ అనిపించుకుంది.దసరా సీజన్ లో పెద్ద సినిమాలు రావడంతో మ్యాడ్ హావ తగ్గింది లేకపోతే సినిమా కలెక్షన్స్ మరింత పెరిగేవే.

మృణాల్ ఠాకూర్‌కు అల్లు అరవింద్ బ్లెస్సింగ్స్.. ఏ విషయంలో అంటే?
టాలీవుడ్ అగ్రనిర్మాత అల్లు అరవింద్ 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె త్వరలోనే ముంబై నుంచి హైదరాబాద్‌కు తిరిగిరావాలని ఆకాంక్షించారు. అంతేకాదు.. ఆమె ఒక ఒక తెలుగు కుర్రాడిని పెళ్లి చేసుకుని పర్మనెంటుగా ఇక్కడే ఉండిపోవాలని కూడా సూచించారు. బ్లెస్సింగ్స్ అందజేశారు. అయితే వాస్తవానికి మృణాల్ ఠాకూర్ మరాఠీ అమ్మాయి అయినా.. 'సీతారామం' సినిమాలోని సీత పాత్రతో తెలుగు ప్రజల మదిపై చెరగని ముద్ర వేసింది. ఈ సినిమా తర్వాత ఆమెకు అనేక తెలుగు సినిమాలలో వరుస ఆఫర్స్ అందుతున్నాయి. వీటిలో ఒకటి.. వచ్చే నెలలో విడుదల కానున్న నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న'. అలాగే…

జెంటిల్‌మెన్ 2 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
శంకర్ దర్శకత్వంలో అర్జున్, మధుబాల హీరో హీరోయిన్లుగా వచ్చిన జెంటిల్‌మేన్ సినిమా తమిళ, తెలుగు భాషల్లో అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. 1993లో రిలీజ్ అయిన ఈసినిమా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. గోకుల్ కృష్ణ దర్శకత్వంలో చేతన్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు- గుమ్మ సాంగ్ రిలీజ్
విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ మంచి హిట్లను అందుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సుహాస్. ఈసారి కూడా అలాంటి కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాతోనే వచ్చేస్తున్నాడు. దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈమధ్యే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

జపాన్ ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్.. సూర్య, కార్తీ సెల్ఫీ వీడియో, నెట్టింట వైరల్
తెలుగులో స్టార్ హీరోల రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్న ప్రముఖ తమిళ హీరోలు సూర్య, కార్తీ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ అన్నదమ్ములే అన్న విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచీ వీరు తమిళంతో పాటు తెలుగులోనూ తమ సినిమాలను రిలీజ్ చేయడంతో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దీంతో వీరి సినిమాలకు ఇక్కడ టైర్ 2 హీరోల స్థాయిలో మంచి కలెక్షన్‌లు వస్తుంటాయి. ముఖ్యంగా హీరో కార్తీ అయితే తన సినిమా ప్రమోషన్స్ సమయంలో కార్తి తెలుగులో స్పష్టంగా మాట్లాడటం, అలాగే సినిమాల్లోని తన పాత్రలకు తానే సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడంతో టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.

బేబి టీమ్ తో సంతోష్ శోభన్- ఇంటెన్స్ గా ప్రీ లుక్
యంగ్ హీరో సంతోష్ శోభన్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి సంతోష్ శోభన్. ఆతరువాత తను నేను, పేపర్ బాయ్, ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ సబ్ స్క్రైబ్, అన్నీ మంచి శకునములే, ప్రేమ్ కుమార్ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ 11 డేస్ కలెక్షన్స్
వరుస హిట్లతో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ ను అందుకొని మరోసారి తన సత్తాను చాటాడు. ఇదే సినిమాతో బాలకృష్ణ కూడా హ్యాట్రిక్ ను అందుకున్నాడు. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో ఈసినిమా రాగా బాలకృష్ణను అనిల్ కొత్త గా చూపించిన విధానం అందరికీ నచ్చింది. అంతేకాకుండా బాలకృష్ణ-శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు.. యాక్షన్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

హాయ్ నాన్న- అమ్మాడి సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా హాయ్ నాన్న. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. దసరా సినిమ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ చేయగా టీజర్ అయితే సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

అలా అడగాలంటే.. నా ఇగో అడ్డొస్తుంది - బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం నుంచి వస్తున్న మూడవ చిత్రం ‘కీడా కోలా’. క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. తరుణ్ భాస్కర్, చైతన్య రావు, రవీంద్ర విజయ్, హరికాంత్, రఘురామ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం చేశారు మేకర్స్. దీనిలో భాగంగా.. ఆదివారం (డిసెంబర్ 29, 2023) హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని…

కన్నప్ప షూటింగ్ లో ప్రమాదం- గాయపడ్డ విష్ణు
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచువిష్ణు హీరోగా వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. న్యూజిలాండ్ లో ఈసినిమాలోని కీలక షెడ్యూల్ ను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ షూటింగ్ లో భాగంగా ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్స్ సీక్వెన్సులను డ్రోన్ సాయంతో షూట్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే డ్రోన్ అదుపు తప్పి నేరుగా వచ్చి మంచు విష్ణు మీద పడిందట. దీంతో మంచు విష్ణుకు స్వల్ప గాయాలయ్యాయట. దీంతో…

పెళ్లిచూపులు కాంబో రిపీట్.. త్వరలో తరుణ్ భాస్కర్‌తో విజయ్ దేవరకొండ సినిమా
'పెళ్లి చూపులు' కాంబో రిపీట్ కాబోతోంది. టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మరియు ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కలయికలో త్వరలో కొత్త సినిమా రూపొందనుంది. ఈ మేరకు హీరో విజయ్ దేవరకొండ స్వయంగా వెల్లడించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరైన 'కీడా కోలా' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కాగా 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం నుంచి వస్తున్న మూడవ చిత్రం 'కీడా కోలా'. క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. తరుణ్ భాస్కర్, చైతన్య…

ఫైనల్లీ వచ్చేసిన జిగర్ తండ డబల్ ఎక్స్ రిలీజ్ డేట్
తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సిద్దార్థ్, బాబి సింహా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. ఈసినిమాకు తెలుగులో రీమేక్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సీక్వెల్ లో లారెన్స్ హీరోగా నటిస్తుండగా.. ఎస్ జే సూర్య మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

జపాన్ ట్రైలర్ రిలీజ్
చేసే ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోవాలని ఆ దిశగానే పాత్రలు చేసుకుంటూ వెళుతున్నాడు కార్తీ. తాను అనుకున్నట్టే జరుగుతుంది కూాడా. తెలుగులో వచ్చిన ఊపిరి, ఖాకి, విరుమాన్, ఖైదీ, సర్దార్ రీసెంట్ గా వచ్చిన పొన్నియన్ సెల్వన్ 1, 2 లో తన పాత్రలు గుర్తుండిపోతాయి. ఇక ఇప్పుడు జపాన్ అంటూ మరో డిఫరెంట్ మేకోవర్ తో బాడీ లాంగ్వేజ్ తో వస్తున్నాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ఈసినిమా వస్తుంది.

ఊరు పేరు భైరవకోన- పెప్పీ మెలోడీ హమ్మా హమ్మా సాంగ్ రిలీజ్
ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఫాంటసీ అడ్వెంచర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం.. ఫ్యామిలీతో కలిసి ఇటలీకి అల్లు అర్జున్
మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి షురూ అయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మరియు నటి లావణ్య త్రిపాఠిల వివాహం మరో మూడు రోజుల్లో జరుగనుంది. నవంబర్ 1వ తేదీన ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ గ్రాండ్‌గా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరవనున్నారు. దీనిలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీసమేతంగా ఇటలీకి పయనమవగా.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన కుటుంబంతో సహా ఇటలీకి బయలుదేరారు. ఈ క్రమంలో తన సతీమణి స్నేహారెడ్డి మరియు పిల్లలతో కలిసి ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా.. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట…

అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఖైదీకి 40 ఏళ్ళు.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో తనను శాశ్వత 'ఖైదీ'ని చేసిందని, తన జీవితంలో ఆ చిత్రం ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నారు టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి. కాగా నేటితో ఆ చిత్రం విడుదలై 40 ఏళ్ళు పూర్తవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చిరంజీవి దీనికి సంబంధించి తన భావాలను పంచుకున్నారు. 'ఖైదీ' చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిదని చెప్పిన ఆయన, అందుకు వారికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన నటీ, నటులకు మరియు టెక్నీషియన్లను అభినందనలు తెలియజేశారు. 'ఖైదీ' చిత్ర దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి గారికి, నిర్మాతలు సంయుక్తా మూవీస్…

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెడ్డింగ్.. సతీసమేతంగా ఇటలీకి పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలికాలంలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే రాజకీయంగానూ పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆయన తన కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి ఇటలీకి పయనమయ్యారు. కాగా పవన్ సోదరుడు నాగబాబు కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మరియు నటి లావణ్య త్రిపాఠిల వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబంతో సహా ఇటలీకి బయలుదేరారు. ఈ క్రమంలో తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక నవంబర్ 1వ తేదీన ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్…