కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 40

Bhagavanth Kesari 9 days Box Office Collections
బాక్సాఫీస్

భగవంత్ కేసరి- అన్ స్టాపబుల్ 9 డేస్ కలెక్షన్స్

ఈరోజుల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకోవడం అంటే మాములు విషయం కాదు. కానీ అలాంటి రేర్ ఫీట్ ను అందుకున్నాడు నటసింహం బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి తాజాగా భగవంత్ కేసరి సినిమాతో వరుసగా బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈసినిమా భగవంత్ కేసరి. ఈసినిమాలో శ్రీలీల కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఈసినిమా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతంచేసుకుంది. అనిల్ కథ, బాలకృష్ణ-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద…

TFN Adminవాట్సాప్
vijay deverakonda to grace keeda cola movie pre release event
సినిమా వార్తలు

కీడా కోలా కోసం ఫ్యామిలీ స్టార్

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. కీడా కోలా అంటూ క్రైమ్ కామెడీ సినిమాగా రాబోతున్న ఈసినిమాలో ఈసినిమాలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు అప్డేట్లు ఇచ్చారు. ఇక అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Jr NTR Joins The New Schedule of Devara in Goa
షూటింగ్ అప్‌డేట్

దేవర కొత్త షెడ్యూల్‌ షురూ.. గోవాకు పయనమైన జూ. ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'దేవర'. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో జూనియర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కాగా 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాకుండా.. వరల్డ్‌వైడ్‌ బ్లాక్ బస్టర్ హిట్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా 'దేవర'పై అంతటా…

Srikanth Mవాట్సాప్
vikrams thangalaan movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ తంగలాన్ రిలీజ్ డేట్ ఫిక్స్

పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. నిజానికి షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ మధ్యలో విక్రమ్ గాయపడటంతో కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై ఆసక్తిని పెంచాయి.

TFN Adminవాట్సాప్
Sapta Sagaralu Dhaati Side B Teaser Released
ట్రైలర్ & టీజర్

సప్త సాగరాలు దాటి - సైడ్ బి టీజర్ రిలీజ్

‘777 చార్లీ’ సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ కన్నడ మూవీ 'సప్త సాగరదాచే ఎల్లో: సైడ్‌-ఏ'. ఈ మూవీలో రక్షిత్‌ శెట్టి సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. లవ్ స్టోరీ నేపథ్యంలో ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ఈ చిత్రానికి యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. దీనికితోడు చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. దీంతో ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రేమ కథ రాలేదని కన్నడనాట ప్రేక్షకులు కితాబునివ్వడం గమనార్హం. ఈ క్రమంలో కన్నడనాట యువతరాన్ని ఉర్రుతలూగించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని తెలుగులో 'సప్త సాగరాలు దాటి' పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

Srikanth Mవాట్సాప్
skanda movie ott release date announced
ఓటీటీ

స్కంద ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా వచ్చిన సినిమా స్కంద. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనగా వచ్చిన ఈసినిమా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ అయి మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే రామ్ పోతినేని యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్-శ్రీలీల కాంబినేషన్, యాక్షన్ ఎలిమెంట్స్ కు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
kamal haasan 234 movie grand launch
సినిమా వార్తలు

కమల్-మణిరత్నం మూవీ మొదలు

చాలా గ్యాప్ తరువాత గత ఏడాది విక్రమ్ తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు విలక్షణ నటుడు కమల్ హాసన్. ఇక ఇప్పుడు ఆ సినిమా జోష్ తో పలు సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తయిపోతుంది.

TFN Adminవాట్సాప్
Mahesh Babu's Sister Priyadharshini Shares Emotional Post About Their Mother Indira Devi
సినిమా వార్తలు

అమ్మని గుర్తుచేసుకుంటూ.. మహేష్ బాబు చెల్లి ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, మరో నటుడు సుధీర్ బాబు సతీమణి ప్రియదర్శిని తమ మాతృమూర్తి, దివంగత నటుడు ఘట్టమనేని కృష్ణ సతీమణి ఇందిరాదేవిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. కాగా గతేడాది అక్టోబర్ 17న ఇందిరాదేవి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే ఇందిరాదేవి తొలి వర్ధంతి కార్యక్రమాన్ని ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా.. ఘట్టమనేని కృష్ణ, ఇందిరాదేవిల ఫోటోలను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ క్రమంలో ఘట్టమనేని అల్లుళ్ళు గల్లా జయదేవ్ మరియు సుధీర్ బాబు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని పుష్పాలతో అంజలి ఘటించారు. ఈ సందర్భంగా తల్లి ఇందిరాదేవిని…

Srikanth Mవాట్సాప్
dop manoj paramahamsa about guntur kaaram movie
సినిమా వార్తలు

గుంటూరు కారంలోకి అలా వచ్చాను- డీవోపీ మనోజ్ పరమహంస

త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఈమధ్యన వచ్చే అప్ డేట్లు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. అంతేకాదు పలువురు ఈసినిమా గురించి చేస్తున్న కామెంట్స్ కూడా సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.

TFN Adminవాట్సాప్
Srungara song out from Aakasam Dhaati Vasthaava movie
సాంగ్

ఆకాశం దాటి వస్తావా- శృంగార సాంగ్ రిలీజ్

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పటికే శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే చిన్న సినిమాలను, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటూ మరో బ్యానర్ పెట్టి ఆ బ్యానర్ లో సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న మరో సినిమా ఆకాశం దాటి వస్తావా. శశికుమార్ ముత్తులూరి దర్శకత్వంలో కొరియోగ్రాఫర్ యశ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆకాశం దాటి వస్తావా. మ్యూజికల్ లవ్ స్టోరీగా ఈసినిమా రాబోతుంది.

TFN Adminవాట్సాప్
Producer TG Viswa Prasad Launches Varun Sandesh's Chitram Chudara Movie Teaser
ట్రైలర్ & టీజర్

వరుణ్ సందేశ్ ‘చిత్రం చూడర’ టీజర్‌ లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘చిత్రం చూడర’. ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో శీతల్ భట్ కథానాయికగా నటిస్తోంది. బిఎమ్ సినిమాస్ బ్యానర్‌పై శేషు మారం రెడ్డి, బోయపాటి బాగ్యలక్ష్మి నిర్మిస్తున్నారు. కాగా అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ధన తుమ్మల సహ నిర్మాత. త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలయికలో వచ్చిన 'బ్రో'తో టాలీవుడ్‌కు హిట్ సినిమా అందించిన స్టార్ ప్రొడ్యూసర్…

Srikanth Mవాట్సాప్
Ney Veyrey song released from animal movie
సాంగ్

యానిమల్- నే వేరే సోల్ ఫుల్ సాంగ్ రిలీజ్

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. డిసెంబర్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, పోస్టర్లకు అలానే టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా మ్యూజికల్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే అమ్మాయి అనే పాటను రిలీజ్ చేశారు. మొదటి సాంగ్ లో రష్మిక-రణబీర్ పెళ్లికి ఇంట్లో పెద్దవాళ్లు ఒప్పుకోకపోవడం.. అయినా వారిద్దరి బయటకు వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం చూపించారు.

TFN Adminవాట్సాప్
Extra Ordinary Man Update Nithiin New Look Poster Goes Viral
ఫస్ట్ లుక్

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిగ్నేచర్ గెటప్‌లో నితిన్‌, లుక్ వైరల్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌'. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్, 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం షూటింగ్…

Srikanth Mవాట్సాప్
Tillu Square Movie Release Date Fixed
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ టిల్లు స్క్యేర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ లను అందుకుంటాయి. అలాంటి సినిమాల్లో డీజే టిల్లు సినిమా కూడా ఒకటి. విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈసినిమా గత ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. యూత్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ తన టైమింగ్ తో బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Anil Ravipudi Joins SS Rajamouli Achieving A Rare Record
సినిమా వార్తలు

రాజమౌళి సరసన నిలిచిన అనిల్ రావిపూడి, అరుదైన రికార్డ్

టాలీవుడ్‌లో ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న పేరు అనిల్ రావిపూడి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో ఆయన తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' దసరా పండుగ సందర్భంగా విడుదలై ఘనవిజయం సాధించింది. దసరా విన్నర్‌గా నిలిచిన ఈ సినిమా బాలయ్య బాబు కెరీర్‌లో రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ సాధించిన మూడో సినిమాగా, అది కూడా హ్యాట్రిక్ మూవీగా రికార్డ్ సృష్టించింది. కాగా ఈ సినిమాతో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఒక అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. అదేంటంటే..? ఇప్పటివరకు ఆయన తీసిన 4 సినిమాలు రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ సాధించాయి. ఇంతకుముందు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్', 'ఎఫ్ 3…

Srikanth Mవాట్సాప్
peddha kapu 1 movie streaming now on ott
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన పెదకాపు 1

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా వచ్చిన సినిమా పెదకాపు1. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు తీసే శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు రూట్ మార్చి ఈసినిమాతో ఫుల్ యాక్షన్ కమ్ ఫ్యాక్షన్ కథతో వచ్చాడు. ఈసినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా అందులో మొదటి పార్ట్ సెప్టెంబర్ 29వ తేదీన రిలీజ్ అయింది. ఆదిపత్యపోరు నేపథ్యంలో వచ్చిన ఈసినిమా బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోగా నటించిన విరాట్ కర్ణ నటన, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

TFN Adminవాట్సాప్
sudha kongara and suriya movie official announcement
సినిమా వార్తలు

అఫీషియల్- సుధాకొంగరతో సూర్య 43 మూవీ

తమిళ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ మొదటినుండీ విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అందుకే సినిమాపై ఫ్లాప్ అయినా సూర్య చేసే పాత్రలు మాత్రం గుర్తిండిపోతాయి. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. పీరియాడిక్ డ్రామాగా భారీ బడ్జెట్ ఈసినిమా రాబోతుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది.

TFN Adminవాట్సాప్
Bhagavanth Kesari movie first week collections
బాక్సాఫీస్

భగవంత్ కేసరి దుమ్ములేపే ఫస్ట్ వీక్ కలెక్షన్స్

మొత్తానికి ఈఏడాది రెండు సినిమాలతో వచ్చి రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాడు నటసింహం బాలకృష్ణ. అంతేకాదు ఈసినిమాతో హ్యాట్రిక్ ను సైతం అందుకున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హ్యాట్రిక్ కొట్టడం అంటే మాములు విషయం కాదు కానీ బాలయ్య మాత్రం ఆ రేర్ ఫీట్ ను అందుకున్నాడు.

TFN Adminవాట్సాప్
vikrams dhruva natchathiram movie trailer is out now
ట్రైలర్ & టీజర్

విక్రమ్ ధ్రువ నక్షత్రం ట్రైలర్ రిలీజ్

తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్ష‌ణ న‌టుడు చియాన్ విక్రమ్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు. ప్రస్తుతం విక్రమ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ధ్రువ నక్షత్రం సినిమా కూడా ఒకటి. అయితే ఈసినిమా ఇప్పటిది కాదు ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న సినిమా. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Dialogue From Family Star Trending in Twitter
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ 'ఐరన్‌ వంచాలా ఏంటి?' డైలాగ్.. ట్విట్టర్‌లో ట్రెండింగ్‌

సోషల్ మీడియా వినియోగం పెరిగిన ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయం హైలైట్ అవుతోంది. ఏ ఫోటో ఎందుకు వైరల్ అవుతుందో.. ఏ వీడియో ఎందుకు ట్రెండ్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. సామాన్యులకు చెందిన విషయాలే ఇలా ఉంటే.. ఇక సెలెబ్రిటీల సంగతి అయితే చెప్పనక్కరలేదు. తాజాగా ఇలాంటిదే ఒక డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్‌ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే..? టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 'ఖుషి' తర్వాత రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో 'సీతారామం' ఫేమ్ మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా న‌టిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజ‌ర్ విడుద‌ల అయిన విష‌యం…

Srikanth Mవాట్సాప్

షేర్