యంగ్ హీరో నితిన్ ,నాపేరు సూర్య డైరెక్టర్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచగా రీసెంట్ గా విడుదలైన డేంజర్ పిల్లా అనే పాట కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.వీటికి తోడు సీనియర్ హీరో,యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ విలన్ గా నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక ఈసినిమా నుండి తాజాగా టీజర్ కూడా విడుదలచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Extra..ordinary…#Extraordinary 🔥
Here’s the teaser 🙂
Entertainment badhalaipoddi 🤗
ITS MY PROMISE 🔥🔥🔥#ExtraOrdinaryMan #ExtraOrdinaryManOnDec8th pic.twitter.com/LwHt0AEDBn
— nithiin (@actor_nithiin) October 30, 2023
ఈ టీజర్ హిలేరియస్ గా వుంది. టీజర్ లో డిఫ్రెంట్ లుక్ తో నితిన్ కనిపించగా ఐయామ్ ఏ జూనియర్ ఆర్టిస్ట్ అంటూ చెప్పే డైలాగ్ అలాగే బాహుబలి 2 సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.హారిస్ జైరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్ కు హైలైట్ అయ్యింది.ఓవరాల్ గా టీజర్ చూస్తే నితిన్ ఈసారి పక్కా బ్లాక్ బాస్టర్ తో బాక్సాఫీస్ బరిలో దిగనున్నాడు.మరి ఈ సినిమా నితిన్ కు ఏ రేంజ్ హిట్ ఇస్తుందో చూడాలి.
సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీల ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి,నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.డిసెంబర్ 8న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అయితే ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.డిసెంబర్ 7న నాని,హాయ్ నాన్న విడుదలవుతుండగా 8న విశ్వక్ సేన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలవుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: