అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు- గుమ్మ సాంగ్ రిలీజ్

ambajipeta marriage band movie gumma song out now

విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ మంచి హిట్లను అందుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సుహాస్. ఈసారి కూడా అలాంటి కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాతోనే వచ్చేస్తున్నాడు. దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈమధ్యే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు మేకర్స్. గుమ్మ గుమ్మ అంటూ హీరోయిన్ కోసం హీరో పాడే ఈ పాట ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో ఇంకా పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్, గోపరాజు, రమణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మహా వెంకటేష్ అలానే గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్ని వాసు ఇంకా ధీరజ్ మొగిలినేని కలిసి సంయుక్తంగా నిరిస్తున్నారు. ఈసినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 15 =