
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 38


అదిరిపోయే రేంజ్ లో విక్రమ్ తంగలాన్ మూవీ టీజర్

బుక్ మై షోలో భగవంత్ కేసరి హవా

జైలర్ రికార్డు ను బ్రేక్ చేసిన లియో

బబుల్ గమ్ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

తంగలాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్


దేవర మాస్ జాతర- పవర్ ఫుల్ వన్ లైనర్స్

ఆదికేశవ- వరల్డ్ కప్ ఎఫెక్ట్.. మళ్లీ మారిన రిలీజ్ డేట్
శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రుద్ర కాళేశ్వర్ రెడ్డి అనే పాత్రలో వైష్ణవ్ తేజ్ కనిపించనున్నాడు. మొదటిసారి ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు వైష్ణవ్ తేజ్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సిత్తరాల సిత్రాంగి, లీలమ్మో అంటూ రెండు పాటలను రిలీజ్ చేశారు.

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల హల్దీ వేడుక.. మెగాస్టార్ దంపతుల బ్లెస్సింగ్స్
టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు మరికొన్ని గంటల్లో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇటలీలోని టస్కనీలో ఈరోజు (నవంబర్ 1, 2023) వీరి వివాహం జరుగనున్న నేపథ్యంలో.. కుటుంబ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి సోదరుడు నాగబాబు తనయుడి వివాహానికి హాజరయ్యేందుకు ఇప్పటికే ఇటలీ చేరుకోగా.. అల్లు ఫ్యామిలీ కూడా వీరికి జత కలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే ఇటలీ చేరుకున్న మెగా ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ చేసింది.

గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే
మచ్ అవైటెడ్ గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తుంన్నారు.దసరాకు ఈసాంగ్ రిలీజ్ అవుతుందని ఎదురుచూశారు కానీ నిరాశే ఎదురైయింది.ఇక దసరాకి మిస్ అయినా దీపావళికి ఎలాగైనా వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.అయితే అంత కన్నా కాస్త ముందుగానే రానుంది.ఈ విషయాన్ని సినిమా నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ వెల్లడించాడు.కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన నాగవంశీ సాంగ్ ఎప్పడు వస్తుందో చెప్పేశాడు.గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ రెడీ అయిపోయిందని కానీ సాంగ్ మీద అంచనాలు అందుకోవాలని ప్రతి సారి కరెక్ట్ చేసుకుంటున్నాం.ఈనెల మొదటి వారంలో సాంగ్ పక్కా రిలీజ్ ఉంటుందని…

వెంకటేష్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన కీడాకోలా డైరెక్టర్ తరుణ్ భాస్కర్
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'కీడాకోలా'. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి హిట్ చిత్రాల తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న మూడవ చిత్రం ఇది. క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. తరుణ్ భాస్కర్, చైతన్య రావు, రవీంద్ర విజయ్, హరికాంత్, రఘురామ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం…

అదిరిపోయే రేంజ్ లో విక్రమ్ తంగలాన్ మూవీ టీజర్
విలక్షణ నటుడు విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకూ పలు పోస్టర్లు రిలీజ్ చేయగా పోస్టర్లతోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్.

విక్రమ్ ధ్రువ నక్షత్రం యూఎస్ ప్రీమియర్స్ డేట్ ఫిక్స్
ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు విలక్షణ నటుడు చియాన్ విక్రమ్. అంతేకాదు జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం విక్రమ్ లిస్ట్ లో పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో ధ్రువ నక్షత్రం సినిమా కూడా ఒకటి. తమిళ్ లో ధృవ నట్చతిరం అనే టైటిల్ తో రిలీజ్ అవుతుండగా.. తెలుగులో ధ్రువ నక్షత్రం అనే టైటిల్ తో రిలీజ్ అవుతుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. అయితే ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా.. దాదాపు ఐదారేళ్ల తరువాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది.

బుక్ మై షోలో భగవంత్ కేసరి హవా
దసరాకు బరిలో దిగి విన్నర్ గా నిలిచింది బాలకృష్ణ భగంవత్ కేసరి.మొదటి రోజు నుండి సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటూ బ్లాక్ బాస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.12రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 132కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో షేర్ 65కోట్లు.ఇక ఈసినిమా బుక్ మై షోలో హావ కొనసాగించింది.ఇప్పటివరకు 1.23 మిలియన్ కుపైగా టికెట్స్ బుక్ అయ్యాయి.

జైలర్ రికార్డు ను బ్రేక్ చేసిన లియో
దళపతి విజయ్ నటించిన లియో దసరా సీజన్ లో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఒక్క తమిళంలోనే కాదు ఇతర భాషల్లోనూ సూపర్ వసూళ్ల తో బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఇక ఈసినిమా తమిళనాడు లో జైలర్ రికార్డు ను బ్రేక్ చేసింది. జైలర్,తమిళనాడులో 195కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. దాంతో అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో సినిమాగా రికార్డులోకెక్కింది. అయితే తాజాగా లియో ఆ ప్లేస్ ను ఆక్రమించింది.లియో కేవలం 12రోజుల్లోనే 200కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ తో ఆల్ టైం టాప్ 2 ప్లేస్ లోకి వెళ్ళింది.పొన్నియన్ సెల్వన్ పార్ట్ 225కోట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది.లియోకి ఇప్పుడు దీన్ని బీట్ చేసి మొదటి స్థానం…

బబుల్ గమ్ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇండస్ట్రీలోకి ఇప్పటివరకూ ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ వారసుడు ఎవరో కాదు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న సుమ కనకాల తనయుడు రోషన్. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా వస్తున్న సినిమా బబుల్ గమ్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్- నాగవంశీ బెస్ట్ విషెస్
స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. ఇక భీష్మ తరువాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయిన నితిన్ ఈసినిమాతో ఎలాగైనా మంచి హిట్ ను కొట్టాలని చూస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఒకవైపు షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు.

బాక్సాఫీస్ వద్ద 'లియో' సంచలనం.. 12 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'లియో' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతూ దళపతి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ మరోసారి తెలిసేలా చేస్తోంది. అక్టోబర్ 19న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన 'లియో' సినిమా కళ్ళు చెదిరే వసూళ్లు రాబడుతోంది. ఇప్పటివరకూ మొత్తం 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.540 కోట్లు వసూళ్లు సాధించి రూ.600 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. తద్వారా కలెక్షన్ల పరంగా దేశంలోని టాప్ 20 సినిమాల్లో చేరింది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' రికార్డుపై గురి పెట్టింది. 'జైలర్' టోటల్ రన్‌లో రూ. 605…

కల్కి2898 ఏడీ విఎఫ్ఎక్స్ ఇండియాలో చేయాలన్నదే గోల్
బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇక ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా.. వాటిలో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది మాత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి సినిమా కోసం. ఈసినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, వీడియోలు రిలీజ్ చేయగా అవి సినిమాపై క్రేజ్ ను మరింత పెంచాయి.

'తలైవా 171'లో రజినీలోని నెగెటివ్ షేడ్స్‌ను చూపిస్తా - లోకేశ్ కనగరాజ్
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించనున్న 'తలైవా 171' గురించి ఒక అద్దిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో రజినీకాంత్ నెగెటివ్ షేడ్స్‌లో కనిపించన్నారా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దీనిపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా రజనీకాంత్ ప్రస్తుతం 'తలైవా 170' సినిమా చేస్తున్నారు. 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీని తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'తలైవా 171' చేయనున్నారు. 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలతో తన సత్తా ఏంటో చూపించారు లోకేశ్. ఇక ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్…

కలర్స్ స్వాతి మంత్ ఆఫ్ మధు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'అందాల రాక్షసి' ఫేమ్ నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి) ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు పొందిన ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ శ్రీకాంత్ నాగోతి రచన, దర్శకత్వం వహించారు. క్రియేటివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్స్పై యశ్వంత్ ములుకుట్ల నిర్మించగా.. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. కాగా నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి కలయికలో ఇది రెండో చిత్రం కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ 'త్రిపుర' అనే సినిమాలో కలిసి నటించగా.. ఇది వీరికి మంచి గుర్తింపు తెచ్చింది. లవ్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి…

తంగలాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్షణ నటుడు చియాన్ విక్రమ్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు. ఇక రీసెంట్ గానే పొన్నియన్ 2 సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు చియాన్ విక్రమ్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది.

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్.. కాక్టెయిల్ పార్టీలో సందడి చేసిన మెగా హీరోస్
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం మరికొన్ని గంటల్లో జరుగనుంది. ఇటలీలోని టస్కనీలో రేపు (నవంబర్ 1, 2023) వీరి వివాహం జరుగనుంది. ఈ మేరకు కుటుంబ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి సోదరుడు నాగబాబు తనయుడి వివాహానికి హాజరయ్యేందుకు ఇప్పటికే ఇటలీ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటలీ చేరుకున్న మెగా ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ చేసింది. దీనిలో భాగంగా సోమవారం రాత్రి వరుణ్-లావణ్య…

సప్త సాగరాలు దాటి - సైడ్ బి నువ్వే నువ్వే సాంగ్ రిలీజ్
కన్నడ సినిమాలకు కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. అక్కడ రిలీజ్ అయి హిట్ అయిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తెలుగు మేకర్స్ కూడా. అందుకే సినిమా హక్కులను సొంతం చేసుకుంటూ ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో పలు సినిమాలను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయింది. దీంతో ఇక్కడ కూడా రిలీజ్ చేయగా ఇక్కడ కూడా హిట్ అయింది.

దేవర మాస్ జాతర- పవర్ ఫుల్ వన్ లైనర్స్
ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఎన్నో సమీకరణాలు ఉంటాయి. సినిమాకు కథ ఎంత ముఖ్యమో.. ఆసినిమాలో వచ్చేకొన్ని డైలాగ్స్ కూడా అంతే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక ఈ మధ్య కాలంలో వన్ లైనర్స్ కు బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఆడియన్స్. అయితే అలాంటి డైలాగ్స్ రాయడం అనేది అందరి డైరెక్టర్లకు రాదు. ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. ఉదాహరణకు త్రివ్రికమ్ పలికించే డైలాగ్స్ సమాజం, విలువలు అన్నట్టు ఉంటాయి.. పూరీ దగ్గరకు వచ్చేసరికి రియలిస్టిక్ గా ఉంటాయి. ఇక కొరటాల ది కూడా సెపరేట్ స్టైల్.

సైంధవ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. వెంకీ కొత్త పోస్టర్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సైంధవ్'. కాగా ఆయనకి ఇది 75వ చిత్రం కావడం విశేషం. 'హిట్' ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ అండ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోంది. 'చంద్రప్రస్థ' అనే ఒక ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్టోరీ జరుగనుంది. ఈ మూవీలో 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

సప్త సాగరాలు దాటి - సైడ్ బి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్ డేట్
కన్నడ స్టార్ హీరో అయిన రక్షిత్ శెట్టి అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన సప్త సాగరాలు దాటి సినిమాతో అయితే తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈసినిమా కన్నడలో రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.