శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా హాయ్ నాన్న. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. దసరా సినిమ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ చేయగా టీజర్ అయితే సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టి పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే సమయమా, గాజు బొమ్మ అనే పాటలను రిలీజ్ చేయగా రెండు పాటలకూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈపాట రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. అమ్మాడి అంటూ వచ్చే ఈపాటను నవంబర్ 4వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. చూడబోతే ఈపాట నాని-మృణాల్ మధ్య వచ్చే మెలొడీ సాంగ్ లా అనిపిస్తుంది.
From sending love to sharing sweet pinches 🫰
It’s a joyful celebration altogether 🤩This blissful melody #Ammaadi is ready to steal your heart from November 4th ❤️🔥#Maiyal #Andhaaju #MelleIshtam #PyaraLaage#HiNanna #HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7th
Natural 🌟… pic.twitter.com/GGz5f9MesR
— Vyra Entertainments (@VyraEnts) October 30, 2023
ఇక ఈసినిమాలో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: