ఊరు పేరు భైరవకోన- పెప్పీ మెలోడీ హమ్మా హమ్మా సాంగ్ రిలీజ్

Humma Humma Song Is Out From Ooru Peru Bhairavakona Movie

ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఫాంటసీ అడ్వెంచర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే మొదటి సింగిల్ నిజమే నే చెబుతున్నా పాటను రిలీజ్ చేయగా ఆ పాట వైరల్‌ హిట్ అయ్యింది. తాజాగా రెండో పాట హమ్మా హమ్మా ను విడుదల చేశారు. ఈపాట సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ గురించి పాడే పాటలాగ అనిపిస్తుంది. శేఖర్ చంద్ర, తిరుపతి జవానా సాహిత్యం అందించగా, రామ్ మిరియాల తన అద్భుతమైన వాయిస్ తో అదనపు ఎనర్జీని తీసుకువచ్చారు. పాటలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

ఈసినిమాలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్‌ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 3 =