అలా అడగాలంటే.. నా ఇగో అడ్డొస్తుంది – బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Brahmanandam Funny Speech at Keedaa Cola Pre-release Event

‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్‌ దాస్యం నుంచి వస్తున్న మూడవ చిత్రం ‘కీడా కోలా’. క్రైం కామెడీ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్‌ హాస్య నటుడు బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. త‌రుణ్ భాస్కర్‌, చైత‌న్య రావు, రవీంద్ర విజయ్‌, హరికాంత్, రఘురామ్‌ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం చేశారు మేకర్స్. దీనిలో భాగంగా.. ఆదివారం (డిసెంబర్ 29, 2023) హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకకి టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘కీడా కోలా’ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని తెలుపుతూ చిత్ర బృందానికి విషెస్ చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘కీడా కోలా’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ.. “గత కొంతకాలంగా తెలుగు చిత్రాల శైలి, స్థాయి మారింది. ప్రతిభ కలిగిన ఎంతోమంది యువ నటీ, నటులు మరియు టెక్నీషియన్స్ తమ ఆలోచనలతో సినిమాలను కొత్తగా తీస్తున్నారు. వారు తీసిన చిత్రాలను చూసినప్పుడు అలాంటి వారి దర్శకత్వంలో నటించాలని నాకూ ఉంటుంది. అయితే ఇన్నేళ్ల సీనియారిటీ ఉండటం మూలాన లోపల ఉన్న ఇగో అడ్డొస్తుంది. వారే నా దగ్గరకి వచ్చి అడిగితే బావుండని కోరుకుంటాను. కానీ కొత్తవారు కాబట్టి నా దగ్గరికి రావడానికి భయపడతారు. అయితే తరుణ్ భాస్కర్ మంచి కథతో న వద్దకు వచ్చాడు. దానితో నేను సంతోషంగా ఫీల్ అయ్యాను. ఆ విధంగా ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. తరుణ్ భాస్కర్ ఇంతకుముందు తీసిన ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలు చూశాను. కామెడీని ఇన్ని రకాలుగా చూపిస్తారా? అని అనిపించింది. ఇక ఈ సినిమాలో ఎందుకు నటించారని చాలా మంది నన్ను అడిగితే.. దానికి సమాధానంగా తరుణ్ భాస్కర్ కాబట్టే చేశానని చెప్పాను” అని అన్నారు.

ఇంకా బ్రహ్మానందం మాట్లాడుతూ.. “ఆ దేవుడి దయ వల్ల ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశాను. ఈ సినిమా టీమ్ నన్ను ట్రీట్ చేసిన విధానం నాకు నచ్చింది. షూటింగ్ జరిగినన్ని రోజులూ ఆర్టిస్టుగా కంటే.. ఓ తండ్రిలా చాలా ప్రేమగా చూసుకున్నారు. వీళ్లతో కలిసి జర్నీ చేయడం వలన నేనూ చిన్నపిల్లాడిలా మారిపోయాను. ఇక చైతన్య అయితే ‘తాత గారు నమస్కారం’ అని ఆటపట్టించాడు. ఈ సినిమాలో నన్ను వీల్ చైర్‌లో కూర్చోబెట్టి కామెడీ చేయించారు. ప్రేక్షకులను నవ్వించాలనే లక్ష్యంతో వల్గారిటీకి తావు లేకుండా నిజాయితీగా ఒక మంచి ప్రయత్నం చేశారు. నాకు చిత్ర పరిశ్రమలో గురువు జంధ్యాల గారు. ఆయనతో పని చేసినప్పుడు ఎలా అనిపించిందో.. ఇప్పుడు తరుణ్ భాస్కర్‌తో పని చేస్తుంటే అలా అనిపించింది. ఓ కమెడియన్ ప్రేక్షకులను నవ్వించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తాడు. తన మొహాన్ని నానా వంకర్లు తిప్పి నవ్వించేందుకు ప్రయత్నిస్తాడు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, హాస్యనట దేవో భవ’ అని పేర్కొన్నారు.

కాగా ‘కీడా కోలా’ సినిమాలో త‌రుణ్ భాస్కర్‌, చైత‌న్య రావు, రవీంద్ర విజయ్‌, హరికాంత్, రఘురామ్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక త‌రుణ్ భాస్కర్‌కి దర్శకుడిగా ఇది తొలి పాన్ ఇండియా సినిమా కావ‌డం విశేషం. ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఉపేంద్ర వర్మ ఎడిటర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వీజీ సైన్మా బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో రానా ద‌గ్గుబాటి సమర్పణలో ‘కీడా కోలా’ నవంబర్ 3న తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =