జపాన్‌ ట్రైలర్‌ లాంఛింగ్‌ ఈవెంట్‌.. సూర్య, కార్తీ సెల్ఫీ వీడియో, నెట్టింట వైరల్

Japan Trailer Launch Event Suriya and Karthi Selfie Video with Fans Goes Viral

తెలుగులో స్టార్ హీరోల రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్న ప్రముఖ తమిళ హీరోలు సూర్య, కార్తీ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ అన్నదమ్ములే అన్న విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచీ వీరు తమిళంతో పాటు తెలుగులోనూ తమ సినిమాలను రిలీజ్‌ చేయడంతో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దీంతో వీరి సినిమాల‌కు ఇక్కడ టైర్ 2 హీరోల స్థాయిలో మంచి కలెక్షన్‌లు వస్తుంటాయి. ముఖ్యంగా హీరో కార్తీ అయితే తన సినిమా ప్రమోషన్స్ సమయంలో కార్తి తెలుగులో స్పష్టంగా మాట్లాడటం, అలాగే సినిమాల్లోని తన పాత్రలకు తానే సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడంతో టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తీ తాజాగా చేస్తోన్న సినిమా ‘జపాన్‌’. కాగా కార్తీకి ఇది 25వ సినిమా కావడం విశేషం. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘జోకర్‌’ మూవీ ఫేమ్‌ రాజు మురుగున్‌ దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్స్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ‘జపాన్’ మూవీ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌, గ్లింప్స్‌తోనే ఈ సినిమా డిఫరెంట్‌గా ఉండబోతుందని అర్థమైపోయింది. అలాగే కార్తీ గెటప్, మేకోవర్‌ ఆకట్టుకునేలా ఉంది. దీంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్‌. ఈ క్రమంలో తాజాగా చెన్నైలో ‘జపాన్‌’ సినిమా ట్రైలర్‌ లాంఛింగ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

చెన్నైలో ఈ వేడుకకు హీరో సూర్య స్పెషల్ గెప్ట్‌గా హాజరయ్యారు. ఈవెంట్‌లో భాగంగా సూర్య స్టైలిష్‌ లుక్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా సూర్య వేదికపైనుంచి సోదరుడు కార్తీతో పాటు అభిమానులు కనిపించేలా ఒక సెల్ఫీ వీడియో తీయడం కార్యక్రమానికే హైలైట్ గా నిలిచింది. కోలీవుడ్ స్టార్ హీరోలు మరియు సోదరులైన సూర్య, కార్తీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇక దీనికి సంబంధించిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను, ఫొటోలను ఫ్యాన్స్ వివరీతంగా షేర్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే.. సూర్య టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కంగువ’. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. శివ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది.

ఇక ‘జపాన్’ చిత్రంలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ తొలిసారి హీరోయిన్‌గా చేస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ‘మా నగరం’, ‘ఖైదీ’, ‘తానక్కరన్’, ‘విక్రమ్’ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ వినేష్ బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. కాగా ‘జపాన్’ సినిమాను దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.