ప్రస్తుతం దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. టీజర్ తో సుహాస్ మళ్లీ మంచి సినిమాతో రాబోతున్నట్టు అర్థమైంది. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలోభాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. గుమ్మ అంటూ వచ్చే ఈపాటను అక్టోబర్ 30 వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలియచేశారు.
ప్రతి పార్టీలో, ప్రతి జాతరలో మోత మోగించే పాట తెచ్చేస్తున్నాడు మన మల్లిగాడు ❤🔥 #AmbajipetaMarriageBand First Single #Gumma out on October 30th 🥁🎺
Promo out today at 6.39 PM ❤🔥#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni… pic.twitter.com/uTDMQez4yX
— Geetha Arts (@GeethaArts) October 28, 2023
కాగా ఈసినిమాలో ఇంకా పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్, గోపరాజు, రమణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మహా వెంకటేష్ అలానే గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్ని వాసు ఇంకా ధీరజ్ మొగిలినేని కలిసి సంయుక్తంగా నిరిస్తున్నారు. ఈసినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: