జపాన్ ట్రైలర్ రిలీజ్

Japan Karthi movie trailer out now

చేసే ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోవాలని ఆ దిశగానే పాత్రలు చేసుకుంటూ వెళుతున్నాడు కార్తీ. తాను అనుకున్నట్టే జరుగుతుంది కూాడా. తెలుగులో వచ్చిన ఊపిరి, ఖాకి, విరుమాన్, ఖైదీ, సర్దార్ రీసెంట్ గా వచ్చిన పొన్నియన్ సెల్వన్ 1, 2 లో తన పాత్రలు గుర్తుండిపోతాయి. ఇక ఇప్పుడు జపాన్ అంటూ మరో డిఫరెంట్ మేకోవర్ తో బాడీ లాంగ్వేజ్ తో వస్తున్నాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ఈసినిమా వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు ఇంకా టీజర్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఓక్రేజీ దొంగగా కార్తీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోనట్టు అర్థమవుతుంది. ఇప్పుడు ట్రైలర్ తో వచ్చేశారు. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. కార్తీ డైలాగ్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూడిక్ ఇంకా యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి.

ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తుండగా.. సునీల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. మానగరం, ఖైదీ, తానక్కరన్, విక్రమ్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ వినేష్ బంగ్లాన్ ‘జపాన్’ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 6 =