తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సిద్దార్థ్, బాబి సింహా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. ఈసినిమాకు తెలుగులో రీమేక్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సీక్వెల్ లో లారెన్స్ హీరోగా నటిస్తుండగా.. ఎస్ జే సూర్య మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా రిలీజ్ డేట్ పై తాజాగా క్లీరిటీ ఇచ్చారు మేకర్స్. ఇప్పటివరకూ దీపావళి పండుగకు రిలీజ్ చేస్తామని చెబుతూ వచ్చారు కానీ రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించారు. ఈసినిమాను దీపావళి పండుగ కానుకగా నవంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Wishing the one and only @offl_Lawrence master a very happy birthday!
On this momentous occasion, we announce that #JigarthandaDoubleX will hit the screens worldwide on the 10th of November. Get ready!
A @karthiksubbaraj film, in theatres Diwali 2023 🔥@iam_SJSuryah… pic.twitter.com/Ehe4O4sN36
— Stone Bench (@stonebenchers) October 29, 2023
ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపట్టి ఇప్పటికే పలు అప్ డేట్లు కూడా ఇచ్చారు. ఇప్పటికే పలు పోస్టర్లు, పాటలు, టీజర్ రిలీజ్ అవ్వగా అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్వరలో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. కాగా ఇక ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. తిరునవుక్కరుసు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. స్టోన్ బెంచ్ ఫిలింస్ వారు నిర్మిస్తున్న ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సురేష్ ప్రొడక్షన్స్‌తోపాటు ఏషియన్ సినిమాస్ కలిసి విడుదల చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: