టాలీవుడ్ అగ్రనిర్మాత అల్లు అరవింద్ ‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె త్వరలోనే ముంబై నుంచి హైదరాబాద్‌కు తిరిగిరావాలని ఆకాంక్షించారు. అంతేకాదు.. ఆమె ఒక ఒక తెలుగు కుర్రాడిని పెళ్లి చేసుకుని పర్మనెంటుగా ఇక్కడే ఉండిపోవాలని కూడా సూచించారు. బ్లెస్సింగ్స్ అందజేశారు. అయితే వాస్తవానికి మృణాల్ ఠాకూర్ మరాఠీ అమ్మాయి అయినా.. ‘సీతారామం’ సినిమాలోని సీత పాత్రతో తెలుగు ప్రజల మదిపై చెరగని ముద్ర వేసింది. ఈ సినిమా తర్వాత ఆమెకు అనేక తెలుగు సినిమాలలో వరుస ఆఫర్స్ అందుతున్నాయి. వీటిలో ఒకటి.. వచ్చే నెలలో విడుదల కానున్న నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’. అలాగే క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అసలేమైందంటే..?
ఇటీవలే ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2023 వేడుకలు దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు పురస్కారాలను గెలుచుకున్నారు. వీరిలో మృణాల్ ఠాకూర్ కూడా ఉన్నారు. ‘సీతా రామం’ సినిమాలోని సీత పాత్రలో ఆమె ప్రదర్శించిన అభినయానికి ఉత్తమ పరిచయ నటిగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఆమెకు అవార్డు అందజేయవలసిందిగా నిర్మాత అల్లు అరవింద్‌ని నిర్వాహకులు వేదికపైకి ఆహ్వానించగా.. ఆయన మృణాల్ ఠాకూర్‌కు అవార్డును అందించి సన్మానించారు. అనంతరం యాంకర్స్‌గా వ్యవహరించిన ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్‌లు తన స్పందన తెలియజేయవలసిందిగా మృణాల్‌ను కోరగా.. ఇది తనకు మొదటి అవార్డ్ అని, అరవింద్ గారి చేతులమీదుగా దీనిని అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “మృణాల్ ఠాకూర్ తెలుగు బాగా మాట్లాడుతోందని, ‘సీతారామం’ తర్వాత అందరూ తనని తెలుగింటి అమ్మాయిగా భావిస్తున్నారని, అందుకే ఆమె హైదరాబాద్‌కు చెందిన కుర్రాడిని పెళ్లి చేసుకోవాలని” ఆకాంక్షించారు. “అంతకుముందు తాను గతంలో ఒక హీరోయిన్ (లావణ్య త్రిపాఠి) విషయంలో కూడా ఇదే విధంగా ఆశీర్వదించానని, ఇప్పుడు ఆమె త్వరలో హైదరాబాద్ అబ్బాయిని (వరుణ్ తేజ్) వివాహం చేసుకోనుందని” కూడా అరవింద్ తెలిపారు. కాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం మరో రెండు రోజుల్లో (నవంబర్ 1) ఇటలీలో జరుగనున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అల్లు అరవింద్వై వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కాగా సైమా అవార్డ్స్ వేడుకల్లో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడిగా టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని నటనకుగానూ అవార్డు అందుకోగా.. ‘సీతారామం’ చిత్రం తరపున మృణాల్ ఠాకూర్ ఉత్తమ పరిచయ నటిగా పొందారు. అలాగే ఉత్తమ సహాయ నటుడిగా ‘భీమ్లా నాయక్’ సినిమాకి రానా, టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ధమాకా చిత్రానికి గానూ ఉత్తమ నటిగా సైమా అవార్డులను గెలుచుకున్నారు. ఇక ఉత్తమ నటుడి కేటగిరీలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అడివి శేష్, దుల్కర్ సల్మాన్, నిఖిల్, సిద్ధూ జొన్నలగడ్డ పోటీ పడగా.. ఉత్తమ నటి కేటగిరిలో మృణాల్ ఠాకూర్, మీనాక్షి చౌదరి, సమంత, నిత్యామీనన్, నేహాశెట్టి, శ్రీలీల పోటీ పడ్డారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్డ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: