శంకర్ దర్శకత్వంలో అర్జున్, మధుబాల హీరో హీరోయిన్లుగా వచ్చిన జెంటిల్మేన్ సినిమా తమిళ, తెలుగు భాషల్లో అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. 1993లో రిలీజ్ అయిన ఈసినిమా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. గోకుల్ కృష్ణ దర్శకత్వంలో చేతన్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. చెన్నై పరిసర ప్రాంతాల్లో 15 రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్లో ఈసినిమాలోని పలు కీలక సన్నివేశాలను అలానే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. అయితే తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందని.. నెక్స్ట్ షెడ్యూల్ ను నవంబర్ లో మొదలుపెట్టనున్నట్టు తెలిపారు. ఈ షెడ్యూల్ చెన్నై, హైదరాబాద్ , పాండిచ్చేరిలో.. మిగతా షెడ్యూల్లను మలేషియా, దుబాయ్, శ్రీలంకలో చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.
The first Schedule of Mega Producer @KT_Kunjumon‘s #Gentleman2 is wrapped up. Next schedule to begin soon in November !
Gentleman-II
A @mmkeeravani Musical @film_gentleman @Vairamuthu@agoks @ajay_64403 @johnsoncinepro @UrsVamsiShekar @PRO_SVenkatesh @fridaymedia2… pic.twitter.com/eFAqF9RHqE
— BA Raju’s Team (@baraju_SuperHit) October 30, 2023
కాగా ఈసినిమాలో నయనతార చక్రవర్తి, ప్రియా లాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సుమన్, మనోజ్ కె జయన్, ప్రసిక్క, కాంతారావు విలన్ అచ్యుత్ కుమార్, బాడవ గోపి, మునీష్ రాజా, ఆర్.వి.ఉదయకుమార్, సెంద్రాయన్, మైమ్ గోపి, రవి ప్రకాష్, శిశిర్ శర్మ, వేల రామమూర్తి, జాన్ మహేంద్రన్, కల్లూరి విమల్, జిగర్తాండ రామ్స్, ప్రేమ్ కుమార్, ఇమ్మాన్ అన్నాచ్చి, ముల్లై, కోతాండమ్, శ్రీ రామ్, జాన్ రోషన్, లొల్లు సభ స్వామినాథన్, జార్జ్ విజయ్, నెల్సన్, సితార, సుధా రాణి, శ్రీ రంజని, సత్య ప్రియ, కన్మణి, మైనా నందిని, శ్రీ లత, కారుణ్య, బాబు పద్మ రాగం, బేబీ, అనీషా.. దాదాపు 50 మంది కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈసినిమాకు అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: