యంగ్ హీరో సంతోష్ శోభన్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి సంతోష్ శోభన్. ఆతరువాత తను నేను, పేపర్ బాయ్, ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ సబ్ స్క్రైబ్, అన్నీ మంచి శకునములే, ప్రేమ్ కుమార్ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అయితే ఈసారి రీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న బేబి టీమ్ తో కలిసి సినిమా చేస్తుండటంతో అప్పుడే సినిమాకు క్రేజ్ పెరిగిపోయింది. సుమన్ పాతూరి దర్శకత్వంలో ప్రేమ కథగా ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమాను ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య అతిథిగా వచ్చారు. అంతేకాదు నాగచైతన్య చేతుల మీదుగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయించారు. ఫస్ట్ లుక్ తోనే సినిమాకు బజ్ క్రియేట్ అయిపోయింది. ఇంటెన్స్ గా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ లో కొన్ని ప్రేమకథలు జీవితకాలం వెంటాడుతుంటాయి అని కూడా రాసి ఉంది. దీంతో ఈసినిమా కూడా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీతో రానున్నట్టు అర్థమవుతుంది.
Happy to launch this Intriguing Pre-look of @AmruthaProd & @massmoviemakers Production No.4 with the super talented @santoshsoban & @harika_alekhya 🤗
Best wishes to Producers @SKNonline , @sairazesh and
Director @sumankpathuri pic.twitter.com/i9imQxXDMc— chaitanya akkineni (@chay_akkineni) October 30, 2023
కాగా ఈసినిమాలో దేత్తడి హారిక హీరోయిన్ గా నటిస్తుంది. షార్ట్ ఫిలింస్, యూ ట్యూబ్ వీడియోస్ తో పేరు తెచ్చుకుంది హారిక. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాత ఎస్కేఎన్, సాయి రాజేష్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంగీతం విజయ్ బుల్గానిన్ అందిస్తున్నాడు. మరి బేబి సినిమా సంచలనం విజయం అందించింది..ఈసినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: