
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 150


సీనియర్ కెమెరా మెన్ కు చిరు సాయం

కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

దసరా బరిలో హరి హర వీరమల్లు?

ఘనంగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వివాహం
నితిన్ చేతిలో కబ్జా సినిమా

అను ఇమ్మాన్యుయేల్ క్యూట్ సెల్ఫీ

కన్ఫామ్-దళపతి 67 లో త్రిష

ఒకరోజు వెనక్కి వినరో భాగ్యము విష్ణు కథ

పెళ్లి పీటలెక్కబోతున్న మెగా ప్రిన్స్

అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ అప్ డేట్

విజయ్ ఫ్యాన్స్ కు సమంత సారీ

2023 లో హ్యాట్రిక్ దిశగా మైత్రీ మూవీ మేకర్స్
బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు మూవీతో నిర్మాణ రంగంలో ప్రవేశించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. భాగస్వామ్యంతో కొన్ని సినిమాలు నిర్మించిన ఈసంస్థ పలు మూవీస్ ను నిర్మిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీస్ 2023 సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రాఫిట్స్ తో దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి 10 వ తేదీ రిలీజ్ అయ్యే అమిగోస్ సక్సెస్ సాధిస్తే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హ్యాట్రిక్ సాధిస్తుంది.

సీనియర్ కెమెరా మెన్ కు చిరు సాయం
మెగాస్టార్ చిరంజీవి దానగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వారిలో చిరంజీవి ఒకరు. ఇప్పటివరకూ చిరు ఎన్నో దానాలు చేశారు. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. ఇప్పుడు మరో కుటుంబాన్ని ఆదుకున్నారు చిరు. సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ కుటుంబానికి చిరు సాయం చేశారు.80, 90లలో దేవరాజ్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుండి చిరంజీవి, బాలకృష్ణ ఇలా ఎందరో పెద్ద పెద్ద నటులతో దేవరాజ్ పని చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ భాషలలో కూడా సినిమాటోగ్రాఫర్ గా దాదాపు 300కు పైగా సినిమాలు చేశారు.అయితే ఇప్పుడు ఆయన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న…

శాకుంతలం ఏలేలో ఏలేలో సాంగ్ రిలీజ్
ఎంతో మంది స్టార్ హీరోలతో పనిచేసిన ఇప్పుడు తనమీదే కోట్లు పెట్టి సినిమాలు తీసే స్థాయికి చేరుకుంది సమంత. రీసెంట్ గానే యశోద సినిమాతో తన సత్తా మరోసారి చూపించింది. ఇప్పుడు శాకుంతలం అంటూ మ్యాజిక్ చేయడానికి వచ్చేస్తుంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణ శేఖర్ విజువల్ వండర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే సమంత ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టి మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, ఆషిక రంగనాథ్ జంటగా తెరకెక్కుతున్న అమిగోస్ మూవీ ఫిబ్రవరి 10, 2023 న రిలీజ్ కానుంది. ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరి, రవి ప్రకాష్, శివన్నారాయణ, చైతన్య కృష్ణ, రఘు కారుమంచి, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ తదితరులు నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందింస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. పారిశ్రామిక వేత్త సిద్దార్థ్‌గా కనిపించనున్న కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో హీరో మూడు…

జపాన్ లో 800 మిలియన్ యెన్ (50 కోట్లు )కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న ఆర్ఆర్ఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

దసరా బరిలో హరి హర వీరమల్లు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. పవన్ కెరీర్ లోనే వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ ఇదివరకెన్నడూ కనిపించని పాత్రలో సందడి చేయబోతుండటంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఇప్పటికే విడుదలైన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.

ఘనంగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వివాహం
టాలీవుడ్ లో గత కొంత కాలంగా సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు యంగ్ డైరెక్టర్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టేశాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు వెంకీ అట్లూరీ. ఆయన వివాహం నేడు జరిగింది. పూజా అనే యువతితో ఆయన ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఫిబ్రవరి 1 వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా వీరి విహహం జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులతో కలిసి దిగిన ఓ ఫొటోని నితిన్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఇక ఫొటోలో ఆ నితిన్ మరియు అతని భార్య షాలిని, నటి కీర్తి సురేష్ మరియు దర్శకుడు వెంకీ కుడుముల ఉన్నారు.

నైజాం లో 17. 38 కోట్ల ప్రాఫిట్ తో వాల్తేరు వీరయ్య మూవీ రికార్డ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ బిగ్గెస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ #SSMB 28
శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా#SSMB 28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ధమాకా మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయినట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. #SSMB 28 మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది.
నితిన్ చేతిలో కబ్జా సినిమా
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క అప్పుడప్పుడు నిర్మాతగా కూడా మారుతుంటారన్న సంగతి తెలిసిందే కదా. నితిన్ గత ఏడాది తమ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతున్నాడు. ఉపేంద్ర నుండి వస్తున్న సినిమా కబ్జా. ఆర్ చంద్రు దర్శకత్వంలో 1970బ్యాక్‌డ్రాప్‌లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్…

కీడా కోలా- బ్రహ్మానందం క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
యంగ్ అండ్ టాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈసినిమాను రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈ చిత్రంలో ఎనిమిది ప్రధాన పాత్రలు ఉన్నాయి. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

అను ఇమ్మాన్యుయేల్ క్యూట్ సెల్ఫీ
స్వప్న సంచారి (2011 ) మూవీ తో బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన అను ఇమ్మాన్యుయేల్ , సూపర్ హిట్ యాక్షన్ హీరో బిజు మూవీ తో కథానాయికగా మారారు. మజ్ను మూవీ తో టాలీవుడ్ , తుప్పరివాలన్ మూవీ తో కోలీవుడ్ కు అను పరిచయం అయ్యారు. ఊర్వశివో రాక్షసివో మూవీతో అను విజయం సాధించారు. ఆ మూవీ హిట్ తో అను పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు.కార్తి జపాన్ (తమిళ ), రావణాసుర మూవీస్ లో అను నటిస్తున్నారు. అను హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

నితిన్ స్వంత బ్యానర్స్ పై పాన్ ఇండియా మూవీ కబ్జ రిలీజ్
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలలో బిజీగా ఉండగా ఈ చిత్రాలతో పాటుగా తాను తెలుగు రాష్ట్రాలలో పలు చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాడన్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం విక్రమ్ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేయగా ఆ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి భారీ లాభాలు కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు నితిన్ మరో భారీ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

కన్ఫామ్-దళపతి 67 లో త్రిష
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ తన తరువాత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్-విజయ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దళపతి 67పై అంచనాలు భారీగానే ఉన్నాయి ఈసినిమాను రీసెంట్ గానే నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు అప్పుడే టెక్నికల్ టీమ్ కు సంబంధించిన వివరాలను కూడా తెలిపారు. ఇప్పుడు ఈసినిమాలో నటించే నటీనటులను ఒక్కొక్కరిగా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈసినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాలో త్రిష…

జీవితంలో చిరు నవ్వులు , ఆశ , కృతజ్ఞత ఉంటే చాలు - సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి, ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీగా తమిళ, తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిన గార్గి మూవీ భారీ కలెక్షన్స్ తో కమర్షియల్ హిట్ గా నిలిచింది.

ఒకరోజు వెనక్కి వినరో భాగ్యము విష్ణు కథ
ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలానికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇక ఇటీవలే కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

పెళ్లి పీటలెక్కబోతున్న మెగా ప్రిన్స్
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు ఒక్కోక్కరు పెళ్లిళ్లు చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. గత రెండేళ్లలో ఎంతోమంది యంగ్ హీరోలు వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. ఇక ఈమధ్యనే నాగశౌర్య కూడా పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటినుండో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనిపించుకుంటున్న శర్వానంద్ సైతం వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. రీసెంట్ గానే ఆయన నిశ్చితార్ధం జరిగింది. ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. గత కొంత కాలంగా వరుణ్ తేజ్ పెళ్లిపై పలు వార్తలు వస్తూనే ఉన్నాయి.

అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ అప్ డేట్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ తో సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ లో నటిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఏజెంట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా గండికోటలో భారతీయుడు 2 మూవీ షూటింగ్
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ 1996 మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ద్విపాత్రాభినయంలో కమల్ హాసన్ పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీలో సుకన్య, మనీషా కొయిరాలా కథానాయికలు. ఈ మూవీలో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

విజయ్ ఫ్యాన్స్ కు సమంత సారీ
స్టార్ హీరోయిన్ సమంత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు సారీ చెబుతుంది. ఇంతకీ ఏ విషయంలో సారీ చెబుతుందంటే.. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత-విజయదేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే మధ్యలో సమంత వేరే సినిమాలతో, విజయ్ లైగర్ తో బిజీగా ఉండటంతో షూట్ కు బ్రేక్ పడింది. అనంతరం సమంత అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ మొదలుపెట్టడానికి ఆలస్యమైంది.