ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలానికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇక ఇటీవలే కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా పడినట్టు తెలుస్తుంది. అయితే ఎక్కువ రోజులు కాదులెండి.. ఒక వెనక్కి వెళ్లినట్టు తెలుస్తుంది. ఈసినిమాను ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 18వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ కు చాలా సినిమాలు ఉండటంతో ఈసినిమాకు ఒకరోజు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో ఇవ్వనున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
కాగా ఈసినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ విశ్వాస్ డేనియల్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























