శాకుంతలం ఏలేలో ఏలేలో సాంగ్ రిలీజ్

Yelelo Yelelo Lyrical Song Released from Shaakuntalam Movie,Shaakuntalam Movie Songs: The Second Single Yelelo Yelelo Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Movie Updates,Shaakuntalam Telugu Moive Latest News,Shaakuntalam Songs,Shaakuntalam Movie Songs,Shaakuntalam Telugu Movie Songs,Shaakuntalam Movie Shooting Updates,Shaakuntalam Telugu Movie Shooting Latest News,Samantha

ఎంతో మంది స్టార్ హీరోలతో పనిచేసిన ఇప్పుడు తనమీదే కోట్లు పెట్టి సినిమాలు తీసే స్థాయికి చేరుకుంది సమంత. రీసెంట్ గానే యశోద సినిమాతో తన సత్తా మరోసారి చూపించింది. ఇప్పుడు శాకుంతలం అంటూ మ్యాజిక్ చేయడానికి వచ్చేస్తుంది. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణ శేఖ‌ర్ విజువల్ వండర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే సమంత ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టి మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ వస్తున్నారు చిత్రబృందం. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేయగా.. తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ఏలేలో ఏలేలో ఏలో యాలా .. ఏటీలోన సాగే నావా, ఏలేలో ఏలేలో ఏలో యాలా .. దూరాలేవో చేరే తోవా అంటూ ఈ పాట సాగుతోంది. చైతన్య ప్రసాద్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఇక ఈపాట అయితే ఆహ్లాదకరంగా ఉండి ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − two =