2023 లో హ్యాట్రిక్ దిశగా మైత్రీ మూవీ మేకర్స్

Mythri Movie Makers to Continuous Success Streak with Amigos,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Mythri Movie Makers,Mythri Movie Makers Latest News,Mythri Movie Makers News,Amigos,Amigos Movie,Amigos Telugu Movie,Amigos Movie Updates,Amigos Telugu Movie Latest News,Amigos Movie Shooting Updates,Amigos Telugu Movie Shooting Latest News,Kanlyan Ram,Nandamuri Kalyan Ram

బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు మూవీతో నిర్మాణ రంగంలో ప్రవేశించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. భాగస్వామ్యంతో కొన్ని సినిమాలు నిర్మించిన ఈసంస్థ పలు మూవీస్ ను నిర్మిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీస్ 2023 సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రాఫిట్స్ తో దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి 10 వ తేదీ రిలీజ్ అయ్యే అమిగోస్ సక్సెస్ సాధిస్తే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హ్యాట్రిక్ సాధిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. వాల్తేరు వీరయ్య మూవీలో మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, ఆషిక రంగ‌నాథ్ జంటగా తెరకెక్కుతున్న అమిగోస్ మూవీ ఫిబ్రవరి 10, 2023 న భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరి, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందింస్తున్నారు. అమిగోస్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ఎన్నో రాత్రులొస్తాయి రీమిక్స్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =