
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 151


సందీప్ కు అదృష్టం కూడా తోడుకావాలి

టాప్ ట్రెండింగ్ లో దసరా టీజర్

విజయ్ 67 లో బాలీవుడ్ స్టార్

సీనియర్ యాక్ట్రెస్ జమున బయోపిక్ లో తమన్నా ?

క్రిటికల్ కండిషన్ లో

పొన్నియన్ సెల్వన్ 2 ఇంట్రెస్టింగ్ అప్ డేట్

టైగర్ నాగేశ్వరరావు టీమ్ కు రేణూ దేశాయ్ థ్యాంక్స్

ఘనంగా మొదలైన నాని 30

నందమూరి తారక రత్న ఆరోగ్యం పై చిరంజీవి స్పందన

చైతుతో డేటింగ్ పై మజిలీ బ్యూటీ క్లారిటీ

మొదలైన సమంత వెబ్ సిరీస్
రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ తో దేశవ్యాప్తంగా వీరు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ వెబ్ సిరీస్ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ను కూడా గత తీసి గత ఏడాది రిలీజ్ చేశారు. సమంత ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ లో చేసి చాలా మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఈదర్శక ద్వయం-సమంత మరోసారి కలసి ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అప్ డేట్ ఎప్పుడో వచ్చింది. అయితే ఈమధ్యనే షూటింగ్ మొదలైంది. సమంత ఇప్పటివరకూ పలు సినిమాలతో…

రాటెన్ టొమాటోస్ వెబ్ సైట్ ఫ్యాన్ ఫేవరెట్ మూవీగా RRR కు గోల్డెన్ టమాటో అవార్డ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

యూట్యూబ్ లో అల ..వైకుంఠపురములో .. మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ డేట్
గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ అల.. వైకుంఠపురములో మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కామెడీ , యాక్షన్ , డ్యాన్స్ సన్నివేశాలలో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఎమోషనల్ , యాక్షన్ లతో ఈ మూవీ ని తెరకెక్కించి త్రివిక్రమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అల.. వైకుంఠపురములో.. మూవీ కి హైలైట్ గా నిలిచాయి. థమన్ ఎస్ సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

సందీప్ కు అదృష్టం కూడా తోడుకావాలి
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్, ప్యాషన్ తో పాటు అదృష్టం కూడా తోడుండాలి. అదృష్టం అనేది కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ అదృష్టం లేక ఎంతో మంది హీరోలు ఇంకా సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక అలాంటి వారిలో సందీప్ కిషన్ కూడా ఉన్నాడు. సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా ఎందుకో సాలిడ్ హిట్ అనేది కొట్టలేకపోతున్నాడు. చేయడానికి విభిన్నమైన కథలను చేస్తున్నా సక్సెస్ రావడంలేదు. అందుకే తనకు అదృష్టం కూడా తోడుకావాలి అని కోరుకుంటున్నాడు హీరో నాని. రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మైఖేల్.

టాలీవుడ్ లో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ తో 2023 శుభారంభం
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్…

టాప్ ట్రెండింగ్ లో దసరా టీజర్
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో చాలా రియలిస్టిక్‌గా రూపొందిస్తున్నారు. ఒక ఫుల్ మాస్ మసాలా సినిమాతో, అదిరిపోయే లుక్స్ తో ఆడియన్స్ ని మెప్పించేందుకు నాని సిద్ధమైనట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా ఫస్ట్ పోస్టర్ నుండే ఈసినిమాపై మంచి అంచనాలను పెంచేశారు. ఆ అంచనాలను టీజర్ తో అమాంత పెంచేశారు మేకర్స్. బొగ్గు గనుల్లో పనిచేసే మనుషులు ఎలా ఉంటారు, వారి వ్యవహార శైలిని టీజర్‌లో చూపించారు. ఈ టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్ తెలుగు లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. మిగతా భాషల్లో సైతం సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు లో…

అమిగోస్- ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ రిలీజ్
కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. అందులో అమిగోస్ సినిమా కూడా ఒకటి. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో విభిన్నమైన కథాంశంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు.

విజయ్ 67 లో బాలీవుడ్ స్టార్
తమిళ్ స్టార్ హీరో విజయ్ ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈఏడాది సంక్రాంతికి వారిసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ తన తరువాత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. జనవరి 2 నుండి ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈసినిమాను అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.

సింగిల్ షాట్.. సింగిల్ క్యారెక్టర్‌తో హన్సిక వన్ నాట్ ఫైవ్ మినిట్స్
సూపర్ హిట్ దేశముదురు మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన హన్సిక, ధనుష్ మాప్పిళ్ళై మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో హన్సిక తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిందాస్ మూవీ తో కన్నడ, విలన్ మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలకు హన్సిక పరిచయం అయ్యారు. పలు తమిళ మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న హన్సిక ఒక ప్రయోగాత్మక చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.

సీనియర్ యాక్ట్రెస్ జమున బయోపిక్ లో తమన్నా ?
శ్రీ (2005) మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమన్నా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీలో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. D 147 మూవీతో తమన్నా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. తాజాగా తమన్నా ఒక బయోపిక్ మూవీకి ఎంపిక…

పోల్ గేమ్ : టాలీవుడ్ హీరోల ఏ అప్ కమింగ్ మూవీ కి మీ ఓటు ?
భోళా శంకర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహెర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో భోళా శంకర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ వేదాళం తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. మురళీశర్మ, రావు రమేష్, రఘుబాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

క్రిటికల్ కండిషన్ లో
నందమూరి తారక రత్న ఆకస్మిక గుండెపోటు కి గురైన సంగతి తెలిసిందే. నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే తన కండిషన్ మొదటి మూడు రోజుల్లో కాస్త సీరియస్ గా మారగా ఆయన కుటుంబీకులు అంతా కూడా బెంగళూరు కి వెళ్లారు. అయితే నిన్ననే ఎట్టకేలకు ఆయన ఆరోగ్యంపై శుభవార్త బయటకి రావడంతో అభిమానులు మరియు సినీ వర్గాల వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

పొన్నియన్ సెల్వన్ 2 ఇంట్రెస్టింగ్ అప్ డేట్
మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. అయితే చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. చోళుల నేపథ్యంలో ఈసినిమాను భారీగా తెరకెక్కించాడు మణిరత్నం. ఈసినిమా సూపర్ హిట్ ను అందించడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ ను అందుకుంది. దాదాపు 450 కోట్లకు పైగా వసూలు చేసింది. నిజానికి ఈసినిమాను ముందు ఒకే సినిమాగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆతరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడే ప్రకటించారు.

300 మంది ఫైటర్స్ తో రామ్ యాక్షన్ సీన్ హైలైట్ గా #RAPO20
పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో రామ్ ఇప్పుడు మరో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని, పెళ్ళి సందD మూవీ ఫేమ్ శ్రీలీల జంటగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న #RAPO20 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

టైగర్ నాగేశ్వరరావు టీమ్ కు రేణూ దేశాయ్ థ్యాంక్స్
పూరీ జగన్నాథ్ సినిమా బద్రితో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ రేణూ దేశాయ్. ఆతరువాత పవన్ తోనే మళ్లీ జాని అనే సినిమాలో నటించింది. కేవలం రెండు సినిమాల్లోనే నటించిన రేణు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నేళ్లు కలిసి ఉన్న వీరు ఆ తరువాత విడిపోయారు. ఇక చాలా ఏళ్లు గ్యాప్ తీసుకోని ఈమధ్యే మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

శాకుంతలం మూడవ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ మేకింగ్ గురించి ప్రత్యేంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు శాకుంతలం సినిమాతో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి వచ్చేస్తున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే మొదటి పాటగా మల్లికా, మల్లికా, రెండో పాటగా రుషివనంలోన అనే పాటను రిలీజ్ చేయగా.. రెండు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేయనున్నారు…

ఘనంగా మొదలైన నాని 30
అష్టాచమ్మా సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన నాని తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్నాడు. అందుకే పక్కిటి కుర్రాడి ఫేమ్ ను తెచ్చుకున్న నాని సినిమాలు అంటే అందరూ ఇష్టపడతారు. ప్రస్తుతం అయితే నాని వరుస సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే దసరా అనే సినిమాలో ఫుల్ మాస్ రోల్ తో అలరించడానికి వచ్చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగిస్తూనే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. రీసెంట్ గానే టీజర్ రిలీజ్ చేయగా.. టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

19 రోజుల వారిసు (వారసుడు) మూవీ కలెక్షన్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వారిసు మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీ, తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యాయి.

నందమూరి తారక రత్న ఆరోగ్యం పై చిరంజీవి స్పందన
నందమూరి తారకరత్న ఆకస్మిక గుండెపోటు కి గురైన సంగతి తెలిసిందే. నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే తన కండిషన్ మొదటి మూడు రోజుల్లో కాస్త సీరియస్ గా మారగా ఆయన కుటుంబీకులు అంతా కూడా బెంగళూరు కి వెళ్లారు. అయితే నిన్ననే ఎట్టకేలకు ఆయన ఆరోగ్యంపై శుభవార్త బయటకి రావడంతో అభిమానులు మరియు సినీ వర్గాల వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

చైతుతో డేటింగ్ పై మజిలీ బ్యూటీ క్లారిటీ
అక్కినేని వారసత్వంతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నాగచైతన్య. ప్రస్తుతం నాగచైతన్య సినీ కెరీర్ అయితే ఎలాంటి ఢోకా లేకుండా సాగిపోతుంది. డిఫరెంట్ కథలతో వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇదిలా ఉండగా సినీ కెరీర్ ను పక్కనపెడితే నాగచైతన్య వ్యక్తిగత జీవితంపై ఈమధ్య పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సమంత-నాగచైనత్య ఇద్దరూ విడిపోయిన తరువాత వీరిద్దరికి సంబంధిచిన ప్రతి విషయం కూడా చర్చలకు దారితీస్తుంది. ఈనేపథ్యంలోనే ఇటీవల నాగ చైతన్య-ధూళిపాళ్ల శోభిత డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ తో రూమర్స్ మొదలయ్యాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు చైతుతో కలిసి మజిలీ సినిమాలో నటించిన దివ్యాంశ…