సీనియర్ కెమెరా మెన్ కు చిరు సాయం

Chiranjeevi Helps Senior Cameraman Devraj,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Chiranjeevi,Chiranjeevi Latest News,Chiranjeevi News,Chiranjeevi About Senior Cameraman Devraj, Senior Cameraman Devraj,Cameraman Devraj, Senior Cameraman Devraj Latest News, Senior Cameraman Devraj News

మెగాస్టార్ చిరంజీవి దానగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వారిలో చిరంజీవి ఒకరు. ఇప్పటివరకూ చిరు ఎన్నో దానాలు చేశారు. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. ఇప్పుడు మరో కుటుంబాన్ని ఆదుకున్నారు చిరు. సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ కుటుంబానికి చిరు సాయం చేశారు.80, 90లలో దేవరాజ్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుండి చిరంజీవి, బాలకృష్ణ ఇలా ఎందరో పెద్ద పెద్ద నటులతో దేవరాజ్ పని చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ భాషలలో కూడా సినిమాటోగ్రాఫర్ గా దాదాపు 300కు పైగా సినిమాలు చేశారు.అయితే ఇప్పుడు ఆయన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి 5లక్షల రూపాయలిచ్చి ఆయనకు సహాయం చేశారు. అంతేకాదు ఫ్యూచర్ లో కూడా ఆయనకు అండగా ఉంటానని భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక చిరు హీరోగా వచ్చిన నాగు, పులిబెబ్బులి, రాణి కాసుల రంగమ్మ వంటి సినిమాలకు కెమెరామెన్ గా పనిచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చిరు గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను సొంతం చేసుకున్నాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు తన తరువాత సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేశారు. ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 4 =