టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు ఒక్కోక్కరు పెళ్లిళ్లు చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. గత రెండేళ్లలో ఎంతోమంది యంగ్ హీరోలు వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. ఇక ఈమధ్యనే నాగశౌర్య కూడా పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటినుండో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనిపించుకుంటున్న శర్వానంద్ సైతం వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. రీసెంట్ గానే ఆయన నిశ్చితార్ధం జరిగింది. ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. గత కొంత కాలంగా వరుణ్ తేజ్ పెళ్లిపై పలు వార్తలు వస్తూనే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా మరోసారి వరుణ్ తేజ్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు తండ్రి నాగబాబు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ.. గత కొన్నాళ్లుగా వరుణ్ పెళ్లి గురించిన ప్రయత్నాలు చేస్తున్నామని.. త్వరలోనే స్వయంగా వరుణ్ తన పెళ్లి పై అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలిపారు. చూద్దాం మరి వరుణ్ తేజ్ ఎప్పుడు ఆ గుడ్ న్యూస్ చెప్తారో, అలానే ఆయనని పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఎవరో అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
కాగా వరుణ్ తేజ్ సినీ కెరీర్ మాత్రం బాగానే కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. గాండీవధారి అర్జున అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. దీనితో పాటు మరొక మూవీ కూడా వరుణ్ తేజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. శక్తి ప్రతాప్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: