కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా గండికోటలో భారతీయుడు 2 మూవీ షూటింగ్

Bharateeyudu 2 Movie Shooting Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Bharateeyudu 2,Bharateeyudu 2 Movie,Bharateeyudu 2 Telugu Movie,Bharateeyudu 2 Update,Bhara

ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా గండికోటలో భారతీయుడు 2 మూవీ షూటింగ్

Bharateeyudu 2 Movie Shooting Latest Updates

Bharateeyudu 2 Movie Shooting Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Bharateeyudu 2,Bharateeyudu 2 Movie,Bharateeyudu 2 Telugu Movie,Bharateeyudu 2 Update,Bhara

శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ 1996 మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ద్విపాత్రాభినయంలో కమల్ హాసన్ పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీలో సుకన్య, మనీషా కొయిరాలా కథానాయికలు. ఈ మూవీలో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయింట్స్ బ్యానర్స్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వా ల్, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్ కథానాయికలు. ఈ మూవీలో సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా విక్రమ్ వంటి భారీ హిట్ ను అందుకున్న ఉలగనాయగన్ కమల్ హాసన్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. తాజాగా ఇండియన్ 2 మూవీ షూటింగ్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా గండికోటలో జరుగుతుంది. దీంతో కమల్ హాసన్ ని చూసేందుకు అభిమానులు గండికోట చేరుకున్నారు. భారీ గా షూటింగ్ స్పాట్ కు వచ్చిన అభిమానులను కమల్ హాసన్ కలిసి మాట్లాడారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్