నితిన్ చేతిలో కబ్జా సినిమా

Nithiin To Release Kabzaa Movie in Telugu,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Kabzaa,Kabzaa Movie,Kabzaa Telugu Movie,Kabzaa Movie Updates,Kabzaa Telugu Movie Latest News,Kabzaa Movie Shooting Updates,Kabzaa Telugu Movie Shooting Latest News,Kabzaa Release Date,Kabzaa Movie Release Date,Kabzaa Telugu Movie Release Date

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క అప్పుడప్పుడు నిర్మాతగా కూడా మారుతుంటారన్న సంగతి తెలిసిందే కదా. నితిన్ గత ఏడాది తమ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతున్నాడు. ఉపేంద్ర నుండి వస్తున్న సినిమా కబ్జా. ఆర్ చంద్రు దర్శకత్వంలో 1970బ్యాక్‌డ్రాప్‌లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టు నితిన్ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు. కబ్జా చిత్రాన్ని మా రుచిరా ఎంటర్టైన్మెంట్స్, ఎన్ సినిమాస్ బ్యానర్ పై తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు నితిన్ తెలిపారు. చూద్దాం మరి ఈసినిమా నితిన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో.

కాగా ఈసినిమాలో మరో కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా నటిస్తున్నాడు. ఇంకా శ్రియా శరణ్, బొమన్ ఇరానీ, ప్రకాష్ రాజ్, కబీర్ దుహన్ సింగ్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, మరాఠి, బెంగాలీ మొత్తం ఏడు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మార్చి 17న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ గా ఈసినిమా రిలీజ్‌ అవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =