జపాన్ లో 800 మిలియన్ యెన్ (50 కోట్లు )కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న ఆర్ఆర్ఆర్
RRR collected 800 Million Yen in Japan

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ఇండియా సినిమాల నుంచి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఆర్ఆర్ఆర్ మూవీ ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఆర్ఆర్ఆర్ మూవీ 800 మిలియన్ యెన్స్ (సుమారు 50 కోట్లు )కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మధ్యే వంద రోజులను కూడా పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రేక్షకులు ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుండంతో త్వరలోనే 100 కోట్ల యెన్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.








