టాలీవుడ్ లో గత కొంత కాలంగా సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు యంగ్ డైరెక్టర్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టేశాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు వెంకీ అట్లూరీ. ఆయన వివాహం నేడు జరిగింది. పూజా అనే యువతితో ఆయన ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఫిబ్రవరి 1 వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా వీరి విహహం జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులతో కలిసి దిగిన ఓ ఫొటోని నితిన్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఇక ఫొటోలో ఆ నితిన్ మరియు అతని భార్య షాలిని, నటి కీర్తి సురేష్ మరియు దర్శకుడు వెంకీ కుడుముల ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా వెంకీ సినీ కెరీర్ కు వస్తే తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఆతరువాత, మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలు తీశాడు. ప్రస్తుతం అయితే ధనుష్ లాంటి స్టార్ హీరో తో సార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా మరికొద్దిరోజుల్లో రిలీజ్ కానుంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17, 2023న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: