స్టార్ హీరోయిన్ సమంత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు సారీ చెబుతుంది. ఇంతకీ ఏ విషయంలో సారీ చెబుతుందంటే.. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత-విజయదేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే మధ్యలో సమంత వేరే సినిమాలతో, విజయ్ లైగర్ తో బిజీగా ఉండటంతో షూట్ కు బ్రేక్ పడింది. అనంతరం సమంత అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ మొదలుపెట్టడానికి ఆలస్యమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ కు సంబంధించి డైరెక్టర్ శివ నిర్వాణ అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ త్వరలో రీస్టార్ట్ కానుందని తెలిపారు. ఇక ఇప్పుడు సమంత కూడా తన ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని తెలియచేసింది. ఓ నెటిజన్ సమంతను ఖుషి సినిమా గురించి అడుగగా.. ఈసినిమా షూటింగ్ త్వరలోనే మళ్లీ ప్రారంభమవుతుందని.. విజయదేవరకొండ ఫ్యాన్స్ కు క్షమాపణలు అంటూ రిప్లై ఇచ్చింది.
#Kushi will resume very soon .. my apologies to @TheDeverakonda fans 🙏@ShivaNirvana @MythriOfficial https://t.co/jW6cm9H4Qc
— Samantha (@Samanthaprabhu2) February 1, 2023
ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: