కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

విరూపాక్ష ఫస్ట్ సింగిల్ అప్ డేట్

virupaksha movie first single update

విరూపాక్ష ఫస్ట్ సింగిల్ అప్ డేట్

Virupaksha Movie First Single Update

virupaksha movie first single update

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇంకా పలు ఇంట్రెస్టింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి 'నచ్చావులే నచ్చావులే' అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. రేపు ఈ పాటను రిలీజ్ చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన చేస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు. ఏప్రిల్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్