ఈమధ్య కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకోవడం చూశాం. గత ఏడాది అయితే లెజెండరీ నటీనటులు సూపర్ స్టార్ కృష్ణ, నవరస నటసార్వభౌముడు సత్యనారాయణ ఇక ఈ ఏడాది అలనాటి అందాల తార జమున ఇంకా డైరెక్టర్ విశ్వనాథ్ ఇలా ఎంతోమందిని కోల్పోయాం. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో తండ్రి కన్నుమూశారు. తమిళ స్టార్ హీరో అజిత్ తండ్రి సుబ్రమణియన్ ఈరోజు చెన్నై లో తన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పలువురు ప్రముఖులు, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అజిత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సుబ్రహ్మణ్యం స్వస్థలం కేరళలోని పాలక్కాడ్. ఆయన కోల్‌కతాకు చెందిన మోహినీ ని పెళ్లి చేసుకున్నారు. సుబ్రహ్మణ్యంకు ముగ్గురు కుమారులు అనుప్ కుమార్, అనిల్ కుమార్,అజిత్‌కుమార్. వీరిలో రెండోకుమారుడు అజిత్. ఇక అజిత్ సినీ కెరీర్ విషయానికి వస్తే ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది వాలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్.. ఈఏడాది సంక్రాంతికి తెగింపు అనే సినిమాతో వచ్చి సందడి చేశారు. ఈసినిమా హిట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అజిత్ మరో యాక్షన్ సినిమాతో రెడీ అవుతున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: